Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 23 Apr 2024 09:34 IST

1.ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే

సీఎం జగన్‌ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. సిద్ధం సభలకు వేల సంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలిస్తుండటంతో సాధారణ ప్రయాణికులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కరవు సీమలో ‘అవినీతి’ సిరి!

రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. వీరికి చుట్టమని చెప్పుకొనే ఒక జడ్పీటీసీ  కూడా ఆయన పరిధిలో వసూళ్లు చేసి ఈ కుటుంబానికి ముట్టజెబుతున్నారు. మొదట నియోజకవర్గ కేంద్రంలో ప్రజాప్రతినిధి పుత్రరత్నం సెటిల్‌మెంట్లలో దుందుడుకుగా వ్యవహరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్రతిష్ఠాత్మకం.. పక్కా వ్యూహం

అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న కీలక ఎన్నికలు కావడంతో కాంగ్రెస్‌, భారాస, భాజపాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అప్పటి ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలను ఇప్పుడు మరింత పకడ్బందీగా అమలుచేస్తున్నాయి. ప్రతి అవకాశాన్ని ఓట్లుగా మలచుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జగన్‌ కుటుంబ ఆస్తుల విలువ రూ.757.65 కోట్లు

పేదలకు, పెత్తందారులకు మధ్య పోరాటం జరుగుతోందని... తాను పేదలకు ప్రతినిధినని పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్‌ ఒక్కరి పేరిటే రూ.529.87 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నాయి. ఆయన భార్య వైఎస్‌ భారతిరెడ్డి, కుమార్తెలు వైఎస్‌ హర్షిణిరెడ్డి, వైఎస్‌ వర్షారెడ్డిల పేరిట ఉన్న ఆస్తులనూ కలిపితే వాటి విలువ రూ.757.65 కోట్లు. ఇది జగన్‌ కుటుంబ ఆస్తుల విలువ. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.ఇదేనా జగన్‌.. మీరు చెప్పిన ఊళ్లు

జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్నవి ఇళ్లు కాదు ఊళ్లు అంటూ ముఖ్యమంత్రి, వైకాపా నాయకులు ఊదరగొట్టారు. పూర్తిస్థాయి మౌలిక వసతులతో పట్టణాల మాదిరిగా తయారవుతాయని ప్రగల్భాలు పలికారు. ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తున్న సాయం పునాదులు, గోడలు నిర్మించడానికే సరిపోతోంది. సామాన్యులకు ఇసుక బంగారమైపోయింది. ఇళ్ల నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సత్యదేవుడి సేవల్లోనూ వైకాపా వేలు

సంప్రదాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఇష్టానుసారం వ్యవహరించారు. వివాదాస్పదమై... చర్చకు దారి తీసినా పట్టించుకోకుండా ముందడుగు వేశారు. ఇదీ ప్రస్తుత వైకాపా ప్రభుత్వ హయాంలో అన్నవరం దేవస్థానంలో గత అధికారి వ్యవహరించిన తీరు. ఓ మంత్రి అండతో దేవస్థానం వర్గాల పూర్తిస్థాయి అభిప్రాయం తీసుకోకుండా ఇష్టానుసారం వ్యవహరించారనే విమర్శలూ ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి

దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. ఒడిశాలో ఈ నెల 15 నుంచి, పశ్చిమ బెంగాల్‌లోని గంగా పరీవాహక ప్రాంతంలో 17 నుంచి తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఖర్గే వద్దకు ఖమ్మం పంచాయితీ

ఖమ్మం కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి ఎంపిక పంచాయితీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు చేరింది. గత కొన్ని రోజులుగా చర్చల మీద చర్చలు జరుగుతున్నా ముఖ్య నాయకులు ఎవరికి వారు తాము సూచించిన వారికే ఇవ్వాలని ఒత్తిడి తెస్తుండటంతో చివరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్ద సోమవారం ఉదయం బెంగళూరులో పంచాయితీ జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఖర్గే సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బెంగాల్‌ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు

పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్‌ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్‌ఎల్‌ఎస్‌టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నాటి పరీక్ష ద్వారా జరిపిన పాతిక వేలకుపైగా నియామకాలు చెల్లవని స్పష్టం చేసింది. వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్‌ మెజార్టీ’

మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుకు చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (పీఎన్‌సీ) ‘సూపర్‌ మెజార్టీ’తో విజయం సాధించింది. మొత్తం 93 స్థానాలకు గాను సొంతంగా 68 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో ముయిజ్జు అనుసరిస్తున్న చైనా అనుకూల విధానానికి దేశంలో బలమైన మద్దతు లభించినట్లయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు