Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 16 Apr 2024 20:59 IST

1. అవినాష్‌.. మీ ఫోన్‌ దర్యాప్తు అధికారికి ఇవ్వండి: వైఎస్‌ సునీత

వివేకా హత్యకేసులో దస్తగిరి అప్రూవర్‌ అయినంత మాత్రాన తప్పించుకునే అవకాశం లేదని సునీత అన్నారు. కేసు దర్యాప్తు ఆలస్యం అవుతోందంటున్న ఎంపీ అవినాష్‌ రెడ్డి.. పోలీసులతోగానీ, సీబీఐతోగానీ ఈ విషయంపై ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తే ఎలా? దారుణ హత్య విషయంలోనూ రాజకీయాలే చేస్తారా? అని మండిపడ్డారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు: కేసీఆర్‌

 తన రాజకీయ ఎదుగుదలలో మెతుకు సీమది కీలక పాత్ర అని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలోని సింగూరు చౌరస్తాలో ఏర్పాటు చేసిన ‘భారాస ప్రజా ఆశీర్వాద సభ’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలంటే పార్లమెంట్‌లో భారాస సభ్యులు ఉండాలన్నారు. మెదక్‌ జిల్లా ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే తెలంగాణ సాధించానన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ఆరోగ్య బీమా రూల్స్‌లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం

ఆరోగ్య బీమాకు సంబంధించి బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) కీలక మార్పులు చేసింది. ఆరోగ్య బీమా క్లెయిములకు సంబంధించిన నిబంధనలను సవరించింది. ముందస్తు వ్యాధుల వెయిటింగ్‌ పీరియడ్‌, మారటోరియం పీరియడ్‌లను తగ్గించింది. దీంతో ఆరోగ్య బీమా కొనుగోలు చేసినవారికి మరింత ప్రయోజనం చేకూరనుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. బ్యాలెట్‌ ఓటింగ్‌తో ఏం జరిగిందో మాకు తెలుసు: సుప్రీంకోర్టు

ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో ఈవీఎం (EVM) ఓట్లతో వీవీప్యాట్‌ (VVPAT) స్లిప్‌లను క్రాస్‌ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం విచారణ జరిపింది. ఈసందర్భంగా రహస్య బ్యాలెట్‌ ఓటింగ్‌ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించిన న్యాయస్థానం పిటీషనర్లపై ఒకింత అసహనం వ్యక్తం చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. బెంగాల్‌ను చొరబాటుదారులకు లీజుకు ఇచ్చారు.. టీఎంసీపై ప్రధాని మోదీ ధ్వజం

పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని టీఎంసీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని ఆ పార్టీ చొరబాటుదారులు, గూండాలకు లీజుకు ఇచ్చిందని ఆరోపించారు. సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన అకృత్యాలను చూసి దేశం మొత్తం నివ్వెరపోయిందన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. రామనవమి వేడుకలపై మోదీ, దీదీ మాటల యుద్ధం

బెంగాల్‌లో రామనవమి వేడుకల విషయంలో ప్రధాని మోదీకి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య మాటల యుద్ధం నెలకొంది. బెంగాల్‌లో రామనవమి వేడుకలను ఆపేందుకు అధికార తృణమూల్ కాంగ్రెస్‌ శాయశక్తులా ప్రయత్నించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో అధికారుల బదిలీల్లో భాజపా జోక్యం చేసుకుంటోందని, అల్లర్లు చెలరేగితే ఆ పార్టీదే బాధ్యత అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో అక్రమంగా ఇరికిస్తున్నారని ఆందోళన

సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో తమవారిని అక్రమంగా నిర్బంధించారంటూ విజయవాడ వడ్డెరకాలనీ వాసులు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా డాబాకొట్ల సెంటర్‌లో రాస్తారోకో చేశారు. రూ.200 ఇస్తామని చెప్పి జగన్‌ రోడ్‌షోకు తీసుకెళ్లారని, ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ఆజాద్‌ వ్యాఖ్యలకు దీటుగా కాంగ్రెస్ నాలుగు ప్రశ్నలు

కాంగ్రెస్‌ పార్టీ భాజపా గెలవాలని కోరుకుంటున్నట్లుగా అనిపిస్తుందని డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP) అధినేత గులాం నబీ ఆజాద్‌ (Ghulam Nabi Azad) చేసిన ఆరోపణలను కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది.  పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ మంగళవారం ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాము భాజపాను గెలిపించాలనుకుంటున్నామని అనడానికి ఏం ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించారు. ఈసందర్భంగా ఆజాద్‌కు పలు ప్రశ్నలు సంధించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. రెండో దశలో సంపన్నులు వీరే.. హేమమాలినికి ఎన్ని రూ.కోట్లంటే..?

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) రెండోవిడత పోలింగ్‌ ఏప్రిల్‌ 26న జరగనుంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 స్థానాలకు ఆ రోజున ఓటింగ్‌ జరగనుంది. ఇందులో మొత్తం 1,210 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో పలువురు సంపన్నులు ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫామ్స్‌ (ADR) నివేదిక వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ఆ అలవాట్లతో.. స్పెర్మ్‌ డీఎన్‌ఏకు ముప్పు!

అనారోగ్యకరమైన జీవనశైలితోపాటు ధూమపానం, మద్యపానం, ప్రాసెస్డ్‌ ఆహారం, సెల్‌ఫోన్‌ విపరీతంగా వాడటం వంటి అలవాట్లతో స్పెర్మ్‌ డీఎన్‌ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని దిల్లీలోని ఎయిమ్స్‌ (AIIMS) వైద్య నిపుణులు పేర్కొన్నారు. పురుషుల్లో వీర్య నాణ్యత తక్కువగా ఉండటం వల్ల వంధ్యత్వం (సంతాన లేమి), మహిళల్లో పదేపదే గర్భ విచ్ఛిత్తి, పిల్లల్లో పుట్టుకతో లోపాలు సంభవించే అవకాశం ఉంటుందనే విషయం చాలామందికి తెలియదన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని