Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Published : 28 May 2024 20:59 IST

1. మోదీని దేవుడు అందుకే పంపారేమో..! రాహుల్‌ గాంధీ

‘ఇండియా’ కూటమి (INDIA Bloc) తన హృదయం, ప్రాణం, రక్తాన్ని ధారపోసి మరీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందని కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. తనను దేవుడే పంపాడంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పేదలకు కాకుండా, ఓ వ్యాపారవేత్తకు సాయం చేసేందుకే ఆయన వచ్చారంటూ ఎద్దేవా చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఫోన్‌ ట్యాపింగ్‌.. దాడుల కోసం తిరుపతన్న ప్రత్యేక టీమ్‌!

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్న కీలకంగా వ్యవహరించారు. ఎస్‌ఐబీ ఐజీ ప్రభాకర్‌రావు, అదనపు ఎస్పీ భుజంగరావు ఆదేశాలతోనే తాను దాడులకు పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తిరుపతన్న పేర్కొన్నట్లు సమాచారం. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ఈడీ వాదనల్లో కేసీఆర్‌ ప్రస్తావన లేదు: న్యాయవాది మోహిత్‌రావు

దిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసీఆర్‌ ప్రస్తావన తేలేదని కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు తెలిపారు. ‘‘ఈడీ రిపోర్టులో ఎక్కడా కూడా కేసీఆర్‌ పేరు రాయలేదు. వాదనల సందర్భంగా ఈడీ మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని ప్రస్తావించింది’’అని మోహిత్‌రావు తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. దొరకని శరీర భాగాలు.. మిస్టరీగానే బంగ్లా ఎంపీ మృతి ఘటన!

బంగ్లాదేశ్‌కు చెందిన ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ (53) కోల్‌కతా శివారులో హత్యకు గురికావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఆయన శరీర భాగాలను గుర్తించడం కష్టంగా మారింది. చిన్న ముక్కలుగా చేసి పడేయడం, ఇటీవల వర్షాలకు అవి కొట్టుకుపోయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ఆ రాష్ట్రాల్లో ఉనికిలో లేని పార్టీకి 400 స్థానాలా?: ఖర్గే

 సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు గెలవడం ఖాయమని కేంద్రంలోని భాజపా పలుమార్లు ప్రచారం చేయడంపై కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) మండిపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో ఉనికిలో లేని ఆ పార్టీ అన్ని స్థానాలను ఎలా గెలుచుకోగలదు అని ఎద్దేవా చేశారు. అమృత్‌సర్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఖర్గే.. మోదీ సర్కార్‌పై విమర్శలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. పోస్టల్‌ బ్యాలెట్లు చెల్లకపోతే ఆ బాధ్యత ఆర్వోలదే: సూర్యనారాయణ

 పోస్టల్‌ బ్యాలెట్లు చెల్లకపోతే ఆ బాధ్యత రిటర్నింగ్‌ అధికారులదేనని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు చెల్లకపోవడం ఎన్నికల ప్రక్రియలో లోపంగా పరిగణించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. యూట్యూబ్‌ కోసం యాడ్‌ బ్లాకర్స్‌ వాడుతున్నారా..? నేరుగా వీడియో చివరికే!

యూట్యూబ్‌ (Youtube)లో ప్రకటనలు లేకుండా వీడియోలు చూసేందుకు చాలామంది యాడ్‌ బ్లాకర్స్‌ (ad blockers)ని ఉపయోగిస్తుంటారు. వారిని అడ్డుకొనేందుకు యూట్యూబ్‌ గతేడాదిగా చర్యలు తీసుకుంటోంది. ముందుగా తమ యాడ్‌ బ్లాకర్‌లను నిలిపివేయాలని కోరుతూ సందేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. సంక్షోభంలో ప్రపంచం.. భారత్‌కు బలమైన నేత అవసరం: జైశంకర్‌

అనేక సంఘర్షణల కారణంగా ప్రపంచం ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకుందని భారత విదేశాంగమంత్రి ఎస్‌.జైశంకర్‌ (Jaishankar) తెలిపారు. ఈ వివాదాలకు ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదని చెప్పారు. ఇటువంటి విపత్కర సమయంలో భారత్‌కు బలమైన నాయకత్వం ఉందనే సందేశాన్ని ప్రపంచ వేదికపై చాటాల్సిన అవసరం ఉందన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. మంచుకొండల్లో మృత్యు ఘంటికలు.. ఎవరెస్టులో 8కి చేరిన మరణాలు!

ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించేందుకు ఔత్సాహిక పర్యటకులు క్యూ కడుతున్నారు. ఈ సాహసయాత్ర చేసే క్రమంలో అక్కడి ప్రతికూల పరిస్థితులు, అనారోగ్యం కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోతుండటం కలవరపెడుతోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. సర్జరీలో తప్పిదం.. బాగున్న కిడ్నీని తొలగించి..!

వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. శస్త్రచికిత్స సమయంలో దెబ్బతిన్న కిడ్నీకి బదులు.. బాగున్న కిడ్నీని తొలగించారు. దీంతో ఆ పేషంట్‌ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. రాజస్థాన్‌ (Rajasthan)లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని