Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 23 Feb 2024 17:00 IST

1. గ్యాస్‌, కరెంటు పథకాలు ప్రారంభం ఆ రోజే

కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండింటి అమలుకు ముహూర్తం ఖరారైంది. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ గ్యారంటీలను ఫిబ్రవరి 27న సాయంత్రం ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఈ పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ హాజరవుతారని చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. లాస్య నందిత భౌతికకాయానికి కేసీఆర్ నివాళి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్‌ నివాళులు అర్పించారు. సికింద్రాబాద్‌ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్‌.. ఎమ్మెల్యే కుటుంబసభ్యులను పరామర్శించారు. కేసీఆర్‌ వెంట.. హరీశ్‌రావు, తలసాని తదితరులు ఉన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఈ WPLలో తెలుగమ్మాయిలు మెరుస్తారా?

మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (WPL 2024)లో రెండో సీజన్‌ నేడు మొదలవుతోంది. దీనిలో సత్తా చాటడానికి తెలుగు అమ్మాయిలు కూడా సై అంటున్నారు. డబ్ల్యూపీఎల్‌లో అదృష్టం పరీక్షించుకోబోతున్న తెలుగు అమ్మాయిలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. వారిలో ఎక్కువ అంచనాలున్నది యువ పేసర్‌ అంజలి శర్వాణి మీదే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎన్విడియా సంపద ఒక్క రోజులో బిగ్‌జంప్‌.. 

ఏదైనా కంపెనీ మంచి త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తే.. ఆ స్టాక్ రాణించడం సహజమే. దాని ప్రభావంతో కంపెనీ మార్కెట్‌ విలువ కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. కానీ, ఒక కంపెనీ ఒక రోజు సంపద కొన్ని కంపెనీల మార్కెట్‌ విలువలను దాటేస్తే దాన్ని ప్రభంజనమే అనాలి. ఆ ఘనతను సాధించింది అమెరికాకు చెందిన ప్రముఖ చిప్‌ తయారీ సంస్థ ఎన్విడియా (Nvidia).పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆ ఎదురుదెబ్బే నాలో కసిని పెంచింది: ఐఏఎస్‌ అధికారిణి

ఐఏఎస్‌ అధికారిణి సోనాల్‌ గోయల్‌ (IAS officer Sonal Goel) ఎక్స్‌లో చేసిన ట్వీట్‌ వైరలైంది. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సమయం దగ్గర పడుతుండడంతో పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను ప్రేరేపించేలా తన మొదటి అటెంప్ట్‌లో మెయిన్స్‌లో వచ్చిన మార్క్‌షీట్‌ను ఎక్స్‌లో పోస్టు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 2-3 రోజుల్లో కేజ్రీవాల్‌ అరెస్టు.. దిల్లీ మంత్రుల సంచలన వ్యాఖ్యలు

భాజపా(BJP)పై దిల్లీ మంత్రి, ఆప్‌(AAP) నేత గోపాల్‌రాయ్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు సీబీఐ నోటీసులు ఇప్పించి, ఆయన్ను అరెస్టు చేయించాలని కుట్ర పన్నుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. టెట్‌, డీఎస్సీ షెడ్యూల్‌పై హైకోర్టులో విచారణ.. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం

టెట్‌, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం ఉండేలా చూడాలన్న పిటిషన్‌పై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. షెడ్యూల్‌ మార్చాలన్న పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తుది విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘జమల్‌కుడు’ పాటకు అల్లు అర్హ డ్యాన్స్‌.. ఫన్‌ ట్విస్ట్‌ ఇదే!

ఇటీవల వచ్చిన ‘యానిమల్‌’ మూవీలోని ‘జమల్‌ కుడు’ పాట యువతను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. సాంగ్‌లో మందు గ్లాస్‌ తలపై పెట్టుకుని బాబీ దేవోల్‌ వేసే స్టెప్‌లు బాగా ట్రెండ్‌ అయ్యాయి. ఇప్పుడు అదే పాటకు  స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ కుమార్తె అర్హ కూడా స్టెప్పులేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రూట్‌ సెంచరీ.. ముగిసిన తొలి రోజు ఆట

రాంచీ వేదికగా ప్రారంభమైన (IND vs ENG) నాలుగో టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. భారత అరంగేట్ర బౌలర్‌ ఆకాశ్ దీప్‌ (3/70) అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అయితే, కష్టాల్లో పడిన ఇంగ్లాండ్‌ను జో రూట్ (106*) సెంచరీతో ఆదుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రజాధనంతో జగన్‌ హెలికాప్టర్లు ఎలా సమకూర్చుకుంటారు?: నాదెండ్ల

ఈ నెల 28న జనసేన-తెదేపా సభ నిర్వహిస్తోందని.. ఉమ్మడి ప్రణాళికలను సభ ద్వారా వెల్లడించబోతున్నామని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్‌ కోసమే తమ పొత్తు అని వివరించారు. ప్రజా ధనంతో జగన్‌ హెలికాప్టర్లు ఎలా సమకూర్చుకుంటారని ప్రశ్నించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని