Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 20 Mar 2024 17:06 IST

1. ఆ వాలంటీర్లను విధుల నుంచి తొలగించాం: సీఈవో

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేశ్‌కుమార్‌ మీనా అన్నారు. ఇప్పటి వరకు 46 మంది వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులను విధుల నుంచి తొలగించామన్నారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే తీవ్ర చర్యలు ఉంటాయని మరోమారు స్పష్టం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మళ్లీ భాజపాలో చేరిన మాజీ గవర్నర్‌ తమిళిసై

తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan ) తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గవర్నర్‌ పదవితో పాటు పుదుచ్ఛేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేసిన ఆమె.. భారతీయ జనతా పార్టీలో (BJP) చేరారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో బుధవారం పార్టీ కండువా కప్పుకొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం.. ఆర్టీవో ఆఫీస్‌కు అల్లు అర్జున్‌

సినీ నటుడు అల్లు అర్జున్‌ బుధవారం ఖైరతాబాద్‌ రవాణాశాఖ కార్యాలయానికి వచ్చారు. అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఆయన కార్యాలయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. రేంజ్‌ రోవర్‌ కారును TG 09 0666 నంబర్‌తో తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎమ్మెల్యే వస్తే లేచి నిలబడరా?.. బీసీలపై వైకాపా దౌర్జన్యం

ఏలూరు జిల్లా దెందులూరు మండలం తిమ్మన్నగూడెంలో బీసీ వర్గానికి చెందిన యువకులపై వైకాపా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దౌర్జన్యానికి పాల్పడ్డారు. అనుచరులతో కలిసి గత రాత్రి ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాహనంపై వెళ్తూ గ్రామంలో బెంచీలపై కూర్చున్న యువకులను చూసి చేయి ఊపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పవన్‌ బరిలో లేకపోతే నేనే పోటీ చేస్తా: మాజీ ఎమ్మెల్యే వర్మ

ఎన్నికల్లో పిఠాపురం శాసనసభ స్థానం నుంచి జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) బరిలో నిలకవపోతే తాను పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే, తెదేపా (TDP) నేత ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పాలిసెట్‌ వాయిదా

తెలంగాణలో పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ (పాలిసెట్‌) వాయిదా పడింది. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో పరీక్షను విద్యాశాఖ వాయిదా వేసింది. మే 17న పాలిసెట్‌ జరగాల్సి ఉండగా.. మే 24న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నా ఫోన్‌కాల్‌ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపారు: మంత్రి పొన్నం ప్రభాకర్‌

హనుమకొండ ఆర్డీవోపై సీఎస్‌ శాంతికుమారికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌కాల్‌ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపించారని అందులో పేర్కొన్నారు. వెంటనే ఆర్డీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఎయిర్‌ఫైబర్‌ యూజర్లకు జియో ఆఫర్‌.. ఫ్రీగా ట్రిపుల్‌ డేటా స్పీడ్‌

ప్రముఖ టెలికాం సంస్థ జియో.. ఎయిర్‌ ఫైబర్‌ (Air fiber) యూజర్లకు ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. 60 రోజుల పాటు ట్రిపుల్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ను ఉచితంగా ఆఫర్‌ చేస్తోంది. అంటే ప్రస్తుత ప్లాన్‌ కంటే మూడింతల అధిక వేగంతో డేటాను అందివ్వనుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మీ ఐదేళ్ల లక్ష్యాలేమిటీ.. మంత్రిత్వశాఖలను అడిగిన ప్రధాని మోదీ..!

రానున్న ఐదేళ్లలో ఏటా వారి శాఖల్లో సాధించాలనుకొన్న లక్ష్యాలు ఏమిటో తెలియజేయాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కేంద్ర మంత్రులను కోరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రభుత్వ పత్రం ఒకటి ఆంగ్ల వార్తా సంస్థ చేతికి అందింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందు ప్రభుత్వంలోని కీలక అధికారులకు ప్రధాని సూచనలు చేస్తూ దీనిని పంపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చైనా విషయంలో ఆయన హెచ్చరికలను నెహ్రూ పట్టించుకోలేదు: జైశంకర్‌

భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చైనాపై ఉదాసీన వైఖరితో వ్యవహరించే వారని కేంద్ర మంత్రి జైశంకర్‌ అన్నారు. చైనా విషయంలో నెహ్రూను పలుమార్లు సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ హెచ్చరించారని తెలిపారు. బుధవారం ఒక జాతీయ వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్‌ పాల్గొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని