Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Mar 2024 17:21 IST

1. యువత కోసం 20లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి: చంద్రబాబు

యువత కోసం 20లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. అధికారంలోకి వచ్చాక .. 60 రోజుల్లో మెగా డీఎస్సీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం నిబంధనలు అమలు కావు: జస్టిస్‌ చలమేశ్వర్‌

ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం ఎన్ని నిబంధనలు ఉన్నా అమలు కావని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారు. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నిక కావాలంటే రూ.కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పదేళ్ల నిజం భారాస.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్‌: కేటీఆర్‌

పదేళ్ల నిజం భారాస.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్‌ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలనలో రుణమాఫీ లేదు.. రైతుబంధు లేదన్నారు. అన్నదాతల్లో బాధ మొదలైందని, యువత ఆవేదనతో ఉన్నారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

ఇవాళ నగరంలోని ఉప్పల్‌ స్టేడియంలో ముంబయి-హైదరాబాద్‌ జట్ల మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌ మార్గంలో మెట్రో రైళ్ల వేళలు పొడిగించారు. రైళ్లు నిర్ణీత సమయానికి మించి నడుస్తాయని హైదరాబాద్‌ మెట్రో సంస్థ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కేరళ సీఎం కుమార్తెపై మనీలాండరింగ్‌ కేసు

కేరళ సీఎం పినరయి విజయన్‌ కుమార్తె వీణా విజయన్‌తోపాటు మరికొందరిపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) అక్రమ నగదు చలామణి చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసింది. ఆమెకు చెందిన ఐటీ సంస్థకు ఓ ప్రైవేటు కంపెనీ అక్రమంగా చెల్లింపులు చేసిందనే ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సీట్ల సర్దుబాటు వేళ.. ఉద్ధవ్‌ వర్గం, కాంగ్రెస్‌ మధ్య ‘కిచిడీ’ చిచ్చు

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ (MVA)లో చీలికలు బయటపడ్డాయి. శివసేన (యూబీటీ)పై కాంగ్రెస్ నేత సంజయ్‌ నిరుపమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాయువ్య ముంబయి నుంచి ఎంపీ గంజనన్‌ కీర్తికర్‌ కుమారుడు అమోల్‌ పోటీ చేస్తున్నారు. ఈ ప్రకటన అనంతరం నిరుపమ్ మీడియాతో మాట్లాడుతూ ‘శివసేన(యూబీటీ) కిచిడీ చోర్‌కు టికెట్‌ ఇచ్చింది. అలాంటి అభ్యర్థుల కోసం మేం పనిచేయం’ అని తేల్చి చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 28 నుంచి టి+0 సెటిల్‌మెంట్‌.. తొలుత ఈ 25 షేర్లకే

స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో షేర్లు అమ్మినా, కొనుగోలు చేసినా అదే రోజు సెటిల్‌మెంట్‌ చేసే ప్రక్రియను సెబీ వేగవంతం చేస్తోంది. గురువారం నుంచి ఐచ్ఛిక ప్రాతిపదికన టి+0 సెటిల్‌మెంట్‌ (T+0 settlement) బీటా వర్షన్‌ను ఆవిష్కరించనుంది. ప్రయోగాత్మకంగా తొలుత కేవలం 25 షేర్లకు, పరిమిత బ్రోకర్లకు మాత్రమే దీన్ని వర్తింపజేయనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి

దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ తమ డెబిట్‌కార్డు నిర్వహణ ఛార్జీలను సవరించింది. ప్రస్తుతం క్లాసిక్‌, గ్లోబల్‌, కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌ కార్డులపై బ్యాంకు రూ.125 (జీఎస్‌టీ అదనం) వసూలు చేస్తోంది. ఏప్రిల్‌ నుంచి దీన్ని రూ.200 చేసింది. యువ, గోల్డ్‌, కాంబో కార్డులపై ఇప్పుడు రూ.175 ఛార్జీ ఉండగా.. దాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రూ.250కు సవరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కేజ్రీవాల్‌ అరెస్టుపై అమెరికా వ్యాఖ్యలు.. భారత్‌ తీవ్ర అభ్యంతరం

మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు వ్యవహారంలో మొన్నామధ్య జర్మనీ ప్రకటన విడుదల చేయగా.. తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా స్పందించింది. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన భారత్‌ చర్యలు చేపట్టింది. దిల్లీలోని యూఎస్‌ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10.కెప్టెన్‌గా తొలిసారి గిల్‌కు రూ. 12 లక్షల జరిమానా.. పునరావృతమైతే ఒక మ్యాచ్‌ వేటు!

గుజరాత్‌ జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌కి చెన్నైతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఘోర పరాభవం ఎదురైంది. ఆ జట్టు చేతిలో 63 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా గిల్‌పై రూ.12 లక్షల జరిమానా విధిస్తూ ఐపీఎల్‌ ప్రకటన చేసింది. ఇదే సీజన్‌లో మరోసారి ఇలా చేస్తే ఒక మ్యాచ్‌ నిషేధం ఎదుర్కొనే ప్రమాదం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని