Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Mar 2024 17:06 IST

1. 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్‌ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..

అభ్యర్థుల తుది జాబితాను తెదేపా (TDP) ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలను వెల్లడించింది. సందిగ్ధంలో ఉన్న చీపురుపల్లి, భీమిలి సహా మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయనున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జగన్‌ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు

తమది విజన్‌.. జగన్‌ది పాయిజన్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన పనిదొంగ, దోపిడీదారుడని వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. భావితరాల భవిష్యత్తు కోసమే భాజపా, జనసేనతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీయే కూటమిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. త్వరలో కూటమి ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రఘురామ ఎన్నికల బరిలో ఉండటం ఖాయమని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆయనకు సీటు ఇవ్వడంపై మూడు పార్టీలు చర్చిస్తున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ

సీఎం రేవంత్‌రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. కాంగ్రెస్‌లో చేరతానని గురువారం ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మర్యాదపూర్వకంగా సీఎంతో సమావేశమయ్యారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కడియం నివాసానికి కాంగ్రెస్‌ నేతలు

వివిధ కారణాలతో ప్రజలు భారాసకు దూరమవుతున్నారని, కాంగ్రెస్‌లో చేరే అంశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని భారాస నేత, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ, రోహిత్‌ చౌదరి, మల్లు రవి, సంపత్‌కుమార్, రోహిన్‌రెడ్డి తదితరులు కడియం నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీలో చేరే అంశంపై చర్చించిన నేతలు.. కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్‌

చేవెళ్లలో పోటీ చేస్తున్నది కాసాని జ్ఞానేశ్వర్‌ కాదు కేసీఆర్ అన్నట్టుగా పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సూచించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేకే, కడియం వంటి నాయకులు పార్టీని కష్ట కాలంలో వదిలిపెట్టి వెళ్తున్నారని.. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. దక్షిణాది నటీనటులకేం తక్కువ.. సౌత్‌ వర్సెస్‌ నార్త్‌పై ప్రియమణి కామెంట్స్‌

సౌత్‌ ఇండస్ట్రీ వర్సెస్‌ బాలీవుడ్‌ అనే చర్చ సినీ పరిశ్రమలో ఎప్పుడూ ఉంటుంది. ఇప్పటికే పలువురు తారలు ఈవిషయంపై స్పందించారు. తాజాగా నటి ప్రియమణి (Priyamani)ఈ అంశంపై స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్‌ మిస్టరీని ఛేదించిన పోలీసులు

రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద ఫోన్‌ను చోరీ చేసేందుకు యత్నించాడో దొంగ. అదే సమయంలో ప్రయాణికుడి సెల్ఫీ వీడియోలో చిక్కి అరెస్టయ్యాడు. ఆ తర్వాత దొంగ వద్ద లభించిన ఫోన్‌ ఆధారంగా ఓ మర్డర్‌ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని కల్యాణ్‌లో చోటుచేసుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బిహార్‌లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్‌

బిహార్‌లో ఇండియా కూటమి (INDIA bloc) పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీల మధ్య సీట్ల లెక్క తేలింది. మొత్తం 40 లోక్‌సభ స్థానాలకు గానూ 26 స్థానాల్లో అర్జేడీ పోటీ చేయనుంది. కాంగ్రెస్‌ 9 చోట్ల, వామపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు మిగిలిన ఐదు చోట్ల బరిలో దిగనున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్‌

రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని