Raghurama krishna raju: ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీయే కూటమిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. 

Published : 29 Mar 2024 15:10 IST

అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీయే కూటమిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. త్వరలో కూటమి ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రఘురామ ఎన్నికల బరిలో ఉండటం ఖాయమని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆయనకు సీటు ఇవ్వడంపై మూడు పార్టీలు చర్చిస్తున్నాయి.

అయితే, అసెంబ్లీ అభ్యర్థిగానా? లేక ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతారా? అనే సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పటికే మూడు పార్టీలు అభ్యర్థులను ప్రకటించినందున.. వాటిలోనే సీటు సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తన నివాసంలో గురువారం రఘురామ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. సీఎం జగన్‌పై ఒంటరి పోరాటం చేస్తోన్న రఘురామకు ఎన్డీయే కూటమి.. నరసాపురం టికెట్‌ ఇవ్వాల్సిందేనని ఆయన అభిమానులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని