Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 03 Apr 2024 16:58 IST

1. తాగునీటి సరఫరా పర్యవేక్షణకు 10 మంది ఐఏఎస్‌లు

తెలంగాణలో తాగునీటి సరఫరా పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. 33 జిల్లాలకు 10 మంది ఐఏఎస్‌లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తాగునీటి సరఫరా సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వైకాపాకు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి రాజీనామా

కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి  వైకాపాకు రాజీనామా చేశారు. పార్టీలో గత కొంతకాలంగా ప్రాధాన్యం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌కు పంపారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరే అవకాశముంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దుష్ప్రచారం చేస్తే ఎవరినీ వదిలి పెట్టను: కేటీఆర్‌

మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు కేకే మహేందర్‌రెడ్డికి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో, సంబంధంలేని విషయాల్లో తన పేరు ప్రస్తావిస్తూ ఆరోపణలు చేస్తున్నారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పవన్‌ కల్యాణ్‌కు అస్వస్థత.. తెనాలి పర్యటన వాయిదా

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు చేపట్టాల్సిన తెనాలి పర్యటన వాయిదా పడింది. ఆయన ఆరోగ్యం సరిగా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్‌ షో, బహిరంగ సభ రద్దయ్యాయి. పవన్‌ కల్యాణ్‌ మంగళవారం ఎండలో 20 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కాంగ్రెస్‌కు షాక్‌.. భాజపాలోకి బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చేరికలు జోరందుకున్నాయి. తాజాగా ప్రముఖ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ కాంగ్రెస్‌కు షాకిచ్చారు. హస్తం పార్టీని వీడి భాజపా గూటికి వెళ్లారు. బుధవారం ఆ పార్టీ నేతల సమక్షంలో కాషాయ కండువా వేసుకున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మనమూ 60 పేర్లు పెట్టేద్దాం : చైనాతో వివాదం వేళ ఆ సీఎం వ్యాఖ్యలు వైరల్

భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు మరోసారి అధికారికంగా పేర్లు పెట్టి, రెచ్చగొట్టేందుకు చైనా యత్నించింది. ఈ నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చైనా 30 ప్రాంతాలకు పేర్లు పెడితే.. మనం 60 ప్రదేశాలకు పేర్లు మార్చాలని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ పేరిట లింక్‌ పంపి రూ.2.5 లక్షలకు టోకరా!

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకూ పేట్రేగిపోతున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా అధిక రాబడులు, ఉద్యోగాలు అంటూ వినూత్న పద్ధతుల్లో ప్రజల్ని బోల్తా కొట్టించి పెద్దఎత్తున డబ్బులు ఎగరేసుకుపోతున్నారు. తాజాగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఓ వ్యక్తి దగ్గర హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ అని నమ్మించి రూ.రెండున్నర లక్షలు కొట్టేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దిల్లీపై ధోనీ వీర బాదుడు.. చెన్నై కెప్టెన్‌ రుతురాజ్‌కు బ్రెట్‌లీ విజ్ఞప్తి

వైజాగ్‌ వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. చెన్నై ఓడిపోయినప్పటికీ అతడి ఆట అభిమానులను అలరించింది. ధోనీ ఆటను చూశాక.. దూకుడు ఏమాత్రం తగ్గలేదనిపిస్తోంది. బ్యాటింగ్‌లో మరింత ఆటను చూడాలని ఉంది. అందుకే, అతడు ఆర్డర్‌లో ముందుకురావాలి’ అని ఆసీస్‌ మాజీ క్రికెటర్లు బ్రెట్‌ లీ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘చైనా నంబర్‌ 1’ అని అప్పుడు నెహ్రూ చెప్పలేదా?: జైశంకర్‌

ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో భారత్‌ శాశ్వత సభ్యత్వంపై చర్చలు జరుగుతున్న సమయంలో భారత తొలి ప్రధాని నెహ్రూ భారత్‌ను కాదని చైనాకు ప్రాధాన్యమిచ్చారని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ నాటి ఘటనలను గుర్తుచేశారు. ఆయన చేసిన కొన్ని తప్పిదాలే నేడు పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్(పీవోకే), చైనా రూపంలో భారత్‌ను ఇబ్బందిపెడుతున్నాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బైడెన్‌ వర్సెస్‌ జిన్‌పింగ్‌: ఫోన్‌లోనే అగ్ర దేశాధినేతల వాగ్వాదం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా దేశాధినేతలు బైడెన్‌, జిన్‌పింగ్‌ ఫోన్‌లోనే పరస్పరం వాగ్వాదానికి దిగారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ కాల్‌ ఇరు దేశాల మధ్య సంబంధాల్లో టెన్షన్‌ను మరింత పెంచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని