Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Apr 2024 15:23 IST

1. అప్పులు తెచ్చి బటన్‌ నొక్కడం గొప్ప కాదు: చంద్రబాబు

ప్రజల జీవితాలతో చెలగాటమాడిన జలగ.. సైకో జగన్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. శ్రీకాకుళంలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ‘‘తెదేపా సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రతి కుటుంబ భవిష్యత్తుకు గ్యారంటీ లభిస్తుంది. అప్పులు తెచ్చి బటన్‌ నొక్కడం గొప్ప కాదు. సంపద సృష్టించే, ఉద్యోగాలు కల్పించే వాళ్లు నాయకులు’’అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కేసీఆర్‌ను నమ్మితే పద్మారావు మునిగినట్టే: సీఎం రేవంత్‌

సికింద్రాబాద్‌ ఎంపీ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ గెలవబోతోందని.. కేంద్రంలోనూ తమ ప్రభుత్వమే రాబోతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘భారాస అభ్యర్థి పద్మారావు మంచోడే కానీ.. కేసీఆర్‌ను నమ్ముకుంటే ఆయన మునిగినట్టే. అతని పరువు తీయడానికే సికింద్రాబాద్‌ అభ్యర్థిగా నిలబెట్టారు’’అని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది

ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటి వరకు 62వేల మంది రాజీనామా చేశారని, 900 మందిపై చర్యలు తీసుకున్నామని ఎన్నికల కమిషన్ తరఫు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ కోర్టుకు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారాస 2 ఎంపీ సీట్లు గెలిచినా మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి

కాంగ్రెస్‌పై విమర్శలు చేసే కేసీఆర్‌.. ఎంపీ ఎన్నికల్లో కనీసం 2 స్థానాల్లోనైనా గెలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. భారాస 2 సీట్లు గెలిచినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ చేశారు. నల్గొండ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో ఆయన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలతో కలిసి పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్‌’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

 ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో(EVM) నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల (VVPAT) స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈసందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్‌ క్లారిటీ

లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ప్రకటించిన మేనిఫెస్టోలో ‘దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక సర్వే’ హామీ రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా ‘పునఃపంపిణీ’ చేస్తామని కాంగ్రెస్‌ చెబుతోందంటూ ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాము అలా చెప్పలేదని రాహుల్‌ గాంధీ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. యూట్యూబ్‌కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్‌’ టీవీ యాప్‌!

వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గజం యూట్యూబ్‌కు దీటుగా ప్రత్యేక వేదికను తెచ్చేందుకు ఎలాన్‌ మస్క్‌ సిద్ధమయ్యారు. యూజర్లు హైక్వాలిటీ వీడియోలు అప్‌లోడ్‌ చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా టీవీ యాప్‌ (X TV app)ను అందుబాటులోకి తేనున్నట్లు ‘ఎక్స్‌’ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అమేఠీ సస్పెన్స్‌ వేళ.. వాద్రా పోస్టర్లు వైరల్‌

ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పార్టీ కార్యాలయం బయట వెలసిన ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా పోస్టర్లు కొత్త చర్చకు దారితీశాయి. ఆ పోస్టర్లలో ‘‘అమేఠీ ప్రజలు ఈసారి రాబర్ట్‌ వాద్రాను కోరుకుంటున్నారు’’ అని రాసి ఉంది. దీంతో ఈ స్థానం నుంచి రాహుల్‌ పోటీ ప్రశ్నార్థకంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భూకంపంతో వణికిన తైవాన్‌.. ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా దృశ్యాలు

తైవాన్‌లో మంగళవారం 6.1 తీవ్రతతో సంభవించిన భూకంప దృశ్యాలు ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా చేస్తున్నాయి. మొత్తం 80 ప్రకంపనలు రావడంతో తైవాన్  వాసులు భయంతో వణికిపోయారు. రాజధాని తైపీతో సహా, పశ్చిమ తైవాన్‌లోని పలు ప్రాంతాల్లో భూకంప ప్రభావం ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీడియో కోసం క్లిక్‌ చేయండి 

10. టీ20 ప్రపంచకప్‌నకు టీమ్‌ ఇండియాను మీరే ఎంపిక చేయండి!

టీ20 ప్రపంచకప్‌ కోసం 15 మందితో టీమ్‌ ఇండియాను ఎంపిక చేయనున్నారు. త్వరలో దీనికోసం సెలక్షన్‌ కమిటీ భేటీ కానుంది. ఒకవేళ మీకు అవకాశం వస్తే ఈ దిగువ 30 మందిలో ఎవరిని ఎంచుకుంటారు. లింక్‌లో పోల్‌ (Poll)లో మీ టీమ్‌ని ఎంచుకోండి. ఎక్కువమంది ఎంచుకున్న టీమ్‌ వివరాలను త్వరలో ప్రచురిస్తాం. పోల్‌ లింక్‌ కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని