icon icon icon
icon icon icon

Chandrababu: అప్పులు తెచ్చి బటన్‌ నొక్కడం గొప్ప కాదు: చంద్రబాబు

ప్రజల జీవితాలతో చెలగాటమాడిన జలగ.. సైకో జగన్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.

Published : 24 Apr 2024 14:12 IST

శ్రీకాకుళం: ప్రజల జీవితాలతో చెలగాటమాడిన జలగ.. సైకో జగన్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. శ్రీకాకుళంలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ప్రజల జీవితాలను తలకిందులు చేసిన దద్దమ్మ ప్రభుత్వమిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు తెదేపా పుట్టినిల్లు అని చెప్పారు. తాను మొదటి నుంచి మహిళా పక్షపాతినని తెలిపారు. మీ కుటుంబాలకు పెద్దకొడుకులా సేవ చేస్తానన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని వివరించారు.

‘‘ఎన్నికలకు నేటి నుంచి 19 రోజులు మాత్రమే ఉంది. మే 13న వైకాపాకు దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలి. ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి. అసమర్థ చేతకాని ప్రభుత్వంలో అన్నీ ఇబ్బందులే. సమర్థ ప్రభుత్వం, నాయకత్వం ఉంటేనే మీ జీవితాలు బాగుపడతాయి. మేం అధికారంలోకి వచ్చాక ‘అమ్మకు వందనం’ కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తాం. ఆడబిడ్డలను లక్షాధికారులను చేయడమే నా లక్ష్యం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచి నీరు సరఫరా చేస్తాం. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తాం.. వడ్డీ లేని రుణాలు అందిస్తాం. స్థలాలు లేని వారికి 2, 3 సెంట్లు భూమి ఇప్పించి గృహాలు నిర్మిస్తాం.

పెంచిన రూ.4 వేల పింఛన్లను ఏప్రిల్‌ నుంచే ఇస్తాం. దివ్యాంగులకు రూ.6 వేలు అందిస్తాం. పింఛన్ల పేరుతో ఈ ప్రభుత్వం శవ రాజకీయాలు చేస్తోంది. జగన్‌ సృష్టించిన సంక్షోభాన్ని సంపద సృష్టితో అధిగమిస్తాం. సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రతి కుటుంబ భవిష్యత్తుకు గ్యారంటీ లభిస్తుంది. అప్పులు తెచ్చి బటన్‌ నొక్కడం గొప్ప కాదు. సంపద సృష్టించే, ఉద్యోగాలు కల్పించే వాళ్లు నాయకులు. ఉత్తరాంధ్ర ద్రోహి జగన్‌.. ఏం చేశారని ఇక్కడికి వస్తున్నారు? ఒక్క ప్రాజెక్టయినా కట్టారా? ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చారా? ఏమీ చేయకుండా ప్రజలకు కథలు చెప్పడానికి వస్తున్నారు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img