Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 Jul 2023 09:15 IST

1. ఆహా.. అలానా.. సరే.. చూద్దాంలే..!

‘మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నాం.. వేధింపులు, అత్యాచారాల నిరోధానికి ప్రతి జిల్లాలో దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశాం.. దిశ ఎస్‌ఓఎస్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. డౌన్లోడ్‌ చేసుకుని ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు చేతితో మూడుసార్లు గట్టిగా ఊపినా చాలు.. క్షణాల్లో పోలీసులు వచ్చేస్తారు. బాధితులకు రక్షణ కల్పిస్తారు...’ ఇదీ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం గొప్పగా చేసుకుంటున్న ప్రచారం. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఫిర్యాదులు వస్తున్నప్పటికీ పోలీసులు సకాలంలో స్పందించడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో స్లీపర్‌ క్లాస్‌ బోగీల కుదింపు

సామాన్య ప్రయాణికులపై మూడొంతుల భారం మిర్యాలగూడ, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ నుంచి భువనేశ్వర్‌ వరకు ప్రతిరోజు నడుస్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు నిరుపేదలకు, కూలీలకు అనుకూలంగా ఉండే రైలు.  స్లీపర్‌ క్లాస్‌ బోగీలను కుదించడం వాటి స్థానంలో ఏసీ బోగీలను పెంచడంతో  సామాన్య ప్రయాణికులపై మూడొంతుల భారం పడుతోంది. మొదట్లో సికింద్రాబాద్‌ నుంచి విశాఖ పట్టణం వరకు మాత్రమే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు 17015, 17016 నెంబర్లపై నడిచేది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కార్తికేయ.. ఇదేం మాయ?

అమాయకుల ఆశే వారికి పెట్టుబడి... ఆకర్షణీయ ప్రచారాలతో వల వేసి, అధిక వడ్డీల ఆశ చూపి రూ.కోట్లు కొల్లగొట్టడం కొన్ని సంస్థలకు సాధారణమైంది. నట్టేట ముంచేస్తూ ఆనక బోర్డు తిప్పేస్తున్నారు. ఆ మధ్య రూ.450 కోట్లు జయలక్ష్మి పాలక వర్గం మింగేస్తే.. అదే దారిలో కాకినాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ‘ది కార్తికేయ కో-ఆపరేటివ్‌ బిల్డింగ్‌ సొసైటీ లిమిటెడ్‌’ నడిచింది.. దాచుకున్న సొమ్ముకు వడ్డీలు కలిస్తే కుటుంబాలకు ఉపయోగపడతాయని ఎదురుచూస్తున్నవారు మోసాలకు గురై రోడ్డున పడ్డారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నాటి మాటలు.. నీటి మూటలేనా?

ప్రజా సంకల్ప పాదయాత్ర, 2019 ఎన్నికల ప్రచారంలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జిల్లాపై వరాల జల్లు కురిపించినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే మరిచారు. జిల్లా నుంచి ఏకంగా ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా గట్టిగా ఒత్తిడి చేయకపోవడంతో ప్రభుత్వం సైతం మిన్నకుండిపోయింది. ఎమ్మెల్యేలు సంబంధిత దస్త్రాలు ఎంతవరకు వచ్చాయనే విషయాన్ని పట్టించుకోవడంలేదనే విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేనందున మంగళవారం జరిగే సభలోనైనా ప్రజల ఆకాంక్షలు నెరవేరిస్తే జిల్లా ఎంతోకొంత ప్రగతి పథంలోకి వెళుతుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అందుకే నవ్వుతూనే ఉండాలట..!

నవ్వు నాలుగు విధాల మంచిది.. అని కొందరంటే, నవ్వు నాలుగు విధాల చేటు.. అని మరికొందరంటారు. ఏదేమైనా.. ఎవరెలా అన్నా.. ‘అందమైన చిరునవ్వు ముందు అన్నీ దిగదుడుపే’ అనడంలో సందేహం లేదు. ఎందుకంటే మనసారా రువ్వే ఓ చిరునవ్వు ఇచ్చే అనుభూతిని, ఆత్మవిశ్వాసాన్ని మరేదీ ఇవ్వలేదు. మరి, నవ్వుతో ఇంకా ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందామా?! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జులై 13నే చంద్రయాన్‌-3 ప్రయోగం.. ఇస్రో ఛైర్మన్‌ అధికారిక ప్రకటన

జాబిల్లిపై అన్వేషణకు చంద్రయాన్‌-3ను ఈ నెల 13న ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌. సోమ్‌నాథ్‌ సోమవారం అధికారికంగా వెల్లడించారు. ఈసారి చందమామ ఉపరితలంపై ల్యాండర్‌ను విజయవంతంగా దించుతామన్న విశ్వాసం తమకు ఉందని చెప్పారు. చంద్రయాన్‌-3 ప్రయోగ తేదీపై ఇటీవల అనధికారిక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో వాటిపై స్పందించిన సోమ్‌నాథ్‌.. తేదీని ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆస్పర్‌టేమ్‌ క్యాన్సర్‌ కారకం!

చక్కెరకు బదులు కృత్రిమ తీపి పదార్థాలు వాడటం కొత్తేమీ కాదు. వీటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఆస్పర్‌టేమ్‌ గురించే. అయితే దీని వాడకం విషయంలో పునరాలోచించుకోవటం మంచిది. ప్రపంచ ఆరోగ్యసంస్థ వచ్చే నెలలో దీన్ని ‘క్యాన్సర్‌ కారకంగా’ ప్రకటించనుంది మరి. ఆస్పర్‌టేమ్‌ చాలా తీయగా ఉంటుంది. అలాగని ఇందులో కేలరీలు ఎక్కువేమీ ఉండవు. అందుకే చాలా పదార్థాలు, పానీయాల్లో తీపి కోసం విరివిగా వాడుతుంటారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పెళ్లైన రెండు నెలలకే డబ్బుతో ఉడాయించిన యువతి

జ్యోతినగర్‌ అన్నపూర్ణకాలనీకి చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్న యువతి డబ్బు, బంగారంతో ఉడాయించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్టీపీసీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నపూర్ణకాలనీకి చెందిన సుద్దాల రేవంత్‌కు గతంలో వివాహం కాగా మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నాడు. అనంతరం వివాహ ప్రయత్నాలను మొదలుపెట్టాడు. ఈ క్రమంలో తన వివరాలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పెళ్లికి వెళ్లేందుకు.. ఎన్నికల బరిలోకి

తమ కుటుంబంలో జరిగే వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఎన్నికల విధులు అడ్డుగా ఉన్నాయనే కారణంతో నివ్వెరపోయే ప్రణాళిక వేశారు ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు విద్యా వాలంటీర్లు. జులై 8న గ్రామంలో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్‌ డ్యూటీని తప్పించుకునేందుకు వీరంతా ఏకంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందుకోసం స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ విచిత్ర ఘటన పశ్చిమబెంగాల్‌లోని అలిపురద్వార్‌ జిల్లా జటేశ్వర్‌ గ్రామంలో జరిగింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఎకరా వరికి బీమా పరిహారం రూ.32

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లులో భానుముక్కల లక్ష్మీరెడ్డి 1.15 ఎకరాల్లో వరి సాగు చేస్తే పంటల బీమా కింద రూ.36.50 పరిహారం వస్తుందని అధికారులు తేల్చారు. అదే గ్రామానికి చెందిన పిచ్చయ్య అనే రైతుకు రెండెకరాల వరికి ఎకరానికి రూ.32 చొప్పున మంజూరు చేశారు. ఈ పరిహారం లెక్కలు చూసి రైతులు విస్తుపోతున్నారు. జిల్లాలో దానిమ్మ సాగు చేసిన రైతులకు అసలు పరిహారం దక్కలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని