ఎకరా వరికి బీమా పరిహారం రూ.32

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లులో భానుముక్కల లక్ష్మీరెడ్డి 1.15 ఎకరాల్లో వరి సాగు చేస్తే పంటల బీమా కింద రూ.36.50 పరిహారం వస్తుందని అధికారులు తేల్చారు.

Updated : 04 Jul 2023 05:37 IST

లెక్కగట్టిన అధికారులు
కిలో బియ్యమైనా వస్తాయా అని రైతుల ఆవేదన

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లులో భానుముక్కల లక్ష్మీరెడ్డి 1.15 ఎకరాల్లో వరి సాగు చేస్తే పంటల బీమా కింద రూ.36.50 పరిహారం వస్తుందని అధికారులు తేల్చారు. అదే గ్రామానికి చెందిన పిచ్చయ్య అనే రైతుకు రెండెకరాల వరికి ఎకరానికి రూ.32 చొప్పున మంజూరు చేశారు. ఈ పరిహారం లెక్కలు చూసి రైతులు విస్తుపోతున్నారు. జిల్లాలో దానిమ్మ సాగు చేసిన రైతులకు అసలు పరిహారం దక్కలేదు.

ఎకరాకు రూ.40వేలకు పైగా పెట్టుబడి

ఎకరా వరికి పంటల బీమా పరిహారంగా రూ.32 సరిపోతుందని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం మంజూరు చేసిన పంటల బీమా సొమ్ముతో కిలో బియ్యమైనా వస్తాయా?అని రైతులు ప్రశ్నిస్తున్నారు. సాగులో కష్టనష్టాలేమిటో అధికారులకు తెలుసా అని మండిపడుతున్నారు. ఎకరాకు రూ.40వేలకు పైగా పెట్టుబడి పెట్టి.. వర్షాలకు నష్టపోయామని, ఇంత దారుణంగా పరిహారం ఇచ్చిన వైనం మునుపెన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.          

న్యూస్‌టుడే, ముండ్లమూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు