పెళ్లికి వెళ్లేందుకు ఎన్నికల బరిలోకి.. విద్యా వాలంటీర్ల ఎత్తుగడ

తమ కుటుంబంలో జరిగే వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఎన్నికల విధులు అడ్డుగా ఉన్నాయనే కారణంతో నివ్వెరపోయే ప్రణాళిక వేశారు ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు విద్యా వాలంటీర్లు. జులై 8న గ్రామంలో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్‌ డ్యూటీని తప్పించుకునేందుకు వీరంతా ఏకంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

Updated : 04 Jul 2023 09:36 IST

తమ కుటుంబంలో జరిగే వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఎన్నికల విధులు అడ్డుగా ఉన్నాయనే కారణంతో నివ్వెరపోయే ప్రణాళిక వేశారు ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు విద్యా వాలంటీర్లు. జులై 8న గ్రామంలో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్‌ డ్యూటీని తప్పించుకునేందుకు వీరంతా ఏకంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందుకోసం స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ విచిత్ర ఘటన పశ్చిమబెంగాల్‌లోని అలిపురద్వార్‌ జిల్లా జటేశ్వర్‌ గ్రామంలో జరిగింది. ఈ ఏడుగురు వాలంటీర్ల కుటుంబంలో జులై 5 నుంచి జులై 7 వరకు వివాహ వేడుకలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడుగురికి జులై 8న ఎలక్షన్‌ డ్యూటీ వేస్తారనే కారణంతో వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరు ఒక్కొక్కరు రూ.500 చొప్పున నామినేషన్‌ రుసుమును ఎన్నికల అధికారులకు చెల్లించి పంచాయతీ బరిలో నిలబడ్డారు. దీంతో వీరిని ఎన్నికల విధులకు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని