జులై 13నే చంద్రయాన్‌-3 ప్రయోగం.. ఇస్రో ఛైర్మన్‌ అధికారిక ప్రకటన

జాబిల్లిపై అన్వేషణకు చంద్రయాన్‌-3ను ఈ నెల 13న ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌. సోమ్‌నాథ్‌ సోమవారం అధికారికంగా వెల్లడించారు.

Updated : 04 Jul 2023 06:43 IST

దిల్లీ: జాబిల్లిపై అన్వేషణకు చంద్రయాన్‌-3ను ఈ నెల 13న ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌. సోమ్‌నాథ్‌ సోమవారం అధికారికంగా వెల్లడించారు. ఈసారి చందమామ ఉపరితలంపై ల్యాండర్‌ను విజయవంతంగా దించుతామన్న విశ్వాసం తమకు ఉందని చెప్పారు. చంద్రయాన్‌-3 ప్రయోగ తేదీపై ఇటీవల అనధికారిక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో వాటిపై స్పందించిన సోమ్‌నాథ్‌.. తేదీని ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. తాజాగా దీనిపై దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘జులై 13-19 వరకు లాంచ్‌ విండో అందుబాటులో ఉంది. తొలి రోజే ప్రయోగం చేపట్టాలని భావిస్తున్నాం’’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని