Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Jul 2023 09:11 IST

1. రుషికొండ రుసుముపై జనాగ్రహం

ఆహ్లాదకర వాతావరణానికి విశాఖ పెట్టింది పేరు. సిటీ ఆఫ్‌ డెస్టినీగా పేరుగాంచింది. వారాంతాల్లో నగర ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారు వస్తారు. ఒత్తిడితో సతమతమయ్యేవారు బీచ్‌లో కాసేపు సేదతీరేందుకు ఆసక్తి చూపుతారు. ఇందుకు రుషికొండ బీచ్‌కు వెళ్లే వారి సంఖ్య అధికం. ఈ బీచ్‌లోకి వెళ్లడానికి జిల్లా యంత్రాంగం ప్రవేశ రుసుం నిర్ణయించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బీచ్‌ను చూసేందుకు డబ్బులు చెల్లించడమేంటి? ఇదేం పనంటూ పర్యాటకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జగనన్నా.. శంకుస్థాపనలేనా?

9 నెలలు... లెక్క ప్రకారం సార్వత్రిక ఎన్నికలకు ఉన్న సమయమిది! 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైకాపా నగరాభివృద్ధిపై ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చడానికి ఉన్న సమయమింతే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప నగర పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పునరుద్ధరణ పనులు పూర్తయిన రాజీవ్‌పార్కు - రాజీవ్‌ మార్గ్‌ల ప్రారంభోత్సవం, బ్రహ్మంసాగర్‌ జలాల పంపిణీ పనులకు శంకుస్థాపనతో సరిపెడతారా? లేక వైకాపా ఆవిర్భావం నుంచి ఇస్తున్న హామీల అమలుకు చర్యలు తీసుకుంటారా?పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా.. మెట్రో పట్టాలెక్కేదెలా?

సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) సిద్ధంగా ఉంది.. సేకరించాల్సిన ఆస్తుల మార్కింగ్‌ చేశారు.. బడ్జెట్‌ కేటాయించారు.. ఇదివరకు వ్యతిరేకించిన పక్షాలే ఇప్పుడు కావాలంటున్నాయి.. అయినా అడుగు ముందుకు పడటం లేదు. పాతబస్తీ మెట్రో చిక్కుముడి వీడటం లేదు. ఇటీవల మంత్రి కేటీఆర్‌ మాటలనుబట్టి చూస్తే ఇప్పట్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేలా కన్పించడం లేదు. ఏ ఎన్నికలు వచ్చినా పాతబస్తీ మెట్రో ఎన్నికల అజెండా అవుతోంది. అసెంబ్లీలోనూ ప్రతిపక్షాలు అడగడం..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అప్పుడు రూ.10... ఇప్పుడు రూ. 100.. ఎందుకిలా?

టమాట ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏప్రిల్‌లో కిలో రూ. 10కి దొరికిన టమాట నేడు రూ.100కు తగ్గడంలేదు. కొన్నేళ్లుగా పరిశీలిస్తే.. ఎప్పుడెప్పుడు ధర పతనమౌతోంది.. ఆకాశాన్ని అంటుతోంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఏ కాలంలో అయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటే పుష్కలంగా పండే టమాట పంటను తెలంగాణ రైతులు సొమ్ము చేసుకోలేకపోతున్నారు. నగరానికి నిత్యం 5 వేల నుంచి 6 వేల క్వింటాళ్ల టమాటా అవసరం కాగా.. ఇందులో తెలంగాణలో పండిన 65 శాతం పంట జనవరిలో మార్కెట్‌కు వచ్చేది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అంధుడైతేనేం.. అదరగొట్టేస్తుంటే!

మనిషికి పట్టుదల, సాధించాలన్న కసి ఉంటే.. అంధత్వం అడ్డు కాదని కర్ణాటకకు చెందిన సుమిత్‌ నిరూపించారు. పుట్టుకతో అంధుడైన సుమిత్‌ పట్టుదలగా ప్రభుత్వ ఉద్యోగం సాధించడమేకాక.. ఎవరి సహాయం లేకుండా సులభంగా కంప్యూటర్‌ ఆపరేట్‌ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. బెళగావిలోని గోకక్‌ ప్రాంతానికి చెందిన సుమిత్‌ మోతేకర్‌ చిన్నప్పటి నుంచి ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ కష్టపడి చదివారు. 2021లో బెళగావి మున్సిపల్‌ కార్పొరేషనులోని ఆరోగ్య విభాగంలో కొలువు సాధించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమ్మఒడి సాయం.. ‘అయోమయం!’

 ‘అల్లవరం మండలానికి చెందిన ఓ గృహస్థుడికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అమలాపురంలోని ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. మూడేళ్లుగా అతడికి అమ్మఒడి లబ్ధి అందింది. ఈ ఏడాది కొత్తగా మరో కొడుకు ఒకటో తరగతి పూర్తి చేయడంతో అమ్మఒడి జాబితాలో అతడి పేరుందని తల్లితో వాలంటీరు ఈ కేవైసీ పూర్తిచేశారు. పెద్ద కొడుక్కి అమ్మఒడి వస్తోందని, చిన్నకొడుకు చదివే పాఠశాలలో బ్యాంకు ఖాతా, ఆధార్‌ వివరాలు ఇవ్వలేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎంసెట్‌ తొలి 200 ర్యాంకర్ల గైర్హాజరు

ఎంసెట్‌ తొలి 200 మంది ర్యాంకర్లలో ఒక్కరు కూడా ధ్రువపత్రాల కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. వీరంతా ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు పొందుతున్నారు. ఎంసెట్‌ తొలివిడత ధ్రువపత్రాల పరిశీలన ఆదివారంతో ముగిసింది. మొత్తం 81,856 మంది అభ్యర్థులు కన్వీనర్‌ కోటాలో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ సీట్ల కోసం సిద్ధమయ్యారు. వారిలో ఎందరు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకుంటారో ఈ నెల 12వ తేదీ నాటికి తేలుతుంది. 9వతేదీ నాటికి 66,215 మంది ఐచ్ఛికాలు ఇచ్చుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పామర్రు-చల్లపల్లి మార్గం.. ప్రాణాలతో చెలగాటం!

కృష్ణా జిల్లా పామర్రు నుంచి కూచిపూడి, మొవ్వ మీదుగా చల్లపల్లి వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారిలో ప్రయాణించడం ఓ సాహసమే అని చెప్పాలి. మొత్తం 26 కిలోమీటర్లున్న ఈ రోడ్డు 21 కి.మీ. మేర ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. ముఖ్యంగా పామర్రు మండలం నాగపట్నం నుంచి పెదపూడి, కూచిపూడి- మొవ్వ కోర్టు వరకు, కొడాలి వంతెన- చల్లపల్లి వరకు దారిలో గుంతలు తప్ప రోడ్డే కనిపించదు. వర్షం వస్తే గోతుల్లో నీరు నిండి లోతు తెలియక వాహనదారులకు ప్రాణ సంకటంగా మారుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వంద అడుగుల బావిలో రోజంతా..

కేరళలో ఓ వ్యక్తి (55) ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. శనివారం ఉదయం ఈ ఘటన జరగ్గా.. బాధితుడు ఇంకా బావిలోనే ఉన్నాడు. అతణ్ని బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తిరువనంతపురంలోని ముక్కోల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రాత్రంతా సహాయకచర్యలు కొనసాగినా.. బాధితుణ్ని బయటకు తీయడం సాధ్యం కాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆహ్వానిస్తారా.. ఆగమంటారా..!

‘‘తలుపులు తెరిచి ఉన్నాయంటే సరిపోదు. లోపల మేం ఉండాలి’’- నాటో సభ్యత్వంపై ఇటీవల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలు. నిజానికి 2008లో జరిగిన రుమేనియాలోని బుకారెస్ట్‌ సదస్సులోనే ఉక్రెయిన్‌ను కూటమిలోకి చేర్చుకుంటామన్న హామీని నాటో ఇచ్చింది. కానీ ఆ దేశం చేరికపై తొలి నుంచీ సభ్యదేశాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని