ఎంసెట్‌ తొలి 200 ర్యాంకర్ల గైర్హాజరు

ఎంసెట్‌ తొలి 200 మంది ర్యాంకర్లలో ఒక్కరు కూడా ధ్రువపత్రాల కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. వీరంతా ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు పొందుతున్నారు.

Updated : 10 Jul 2023 06:42 IST

తొలి వెయ్యిలో 104 మంది మాత్రమే రాక
ఎంసెట్‌ ధ్రువపత్రాల పరిశీలనలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ తొలి 200 మంది ర్యాంకర్లలో ఒక్కరు కూడా ధ్రువపత్రాల కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. వీరంతా ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు పొందుతున్నారు. ఎంసెట్‌ తొలివిడత ధ్రువపత్రాల పరిశీలన ఆదివారంతో ముగిసింది. మొత్తం 81,856 మంది అభ్యర్థులు కన్వీనర్‌ కోటాలో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ సీట్ల కోసం సిద్ధమయ్యారు. వారిలో ఎందరు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకుంటారో ఈ నెల 12వ తేదీ నాటికి తేలుతుంది. 9వతేదీ నాటికి 66,215 మంది ఐచ్ఛికాలు ఇచ్చుకున్నారు. అగ్ర, ఉత్తమ ర్యాంకర్లు జాతీయస్థాయి విద్యాసంస్థల్లో చదివేందుకు ఆసక్తి చూపుతుండగా.. మిగిలిన వారిలో చాలామంది విద్యార్థులు టాప్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ సీటు రాదని అంచనాకు వచ్చి.. యాజమాన్య కోటాలో సీట్లు ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.

కన్వీనర్‌ కోటాలో సీఎస్‌ఈ సీట్లు 21,503

173 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 1,07,039 సీట్లు ఉండగా.. కన్వీనర్‌ కోటా కింద 76,359 ఉన్నాయి. ఇందులో 51,605 సీట్లు సీఎస్‌ఈ, ఐటీ, సంబంధిత బ్రాంచీల్లోనివే. వీటిలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ) సీట్లు 21,503 ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌), సీఎస్‌ఈ (ఏఐ) కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని