Inspiration: అంధుడైతేనేం.. అదరగొట్టేస్తుంటే!

మనిషికి పట్టుదల, సాధించాలన్న కసి ఉంటే.. అంధత్వం అడ్డు కాదని కర్ణాటకకు చెందిన సుమిత్‌ నిరూపించారు. పుట్టుకతో అంధుడైన సుమిత్‌ పట్టుదలగా ప్రభుత్వ ఉద్యోగం సాధించడమేకాక.. ఎవరి సహాయం లేకుండా సులభంగా కంప్యూటర్‌ ఆపరేట్‌ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు.

Updated : 10 Jul 2023 07:34 IST

మనిషికి పట్టుదల, సాధించాలన్న కసి ఉంటే.. అంధత్వం అడ్డు కాదని కర్ణాటకకు చెందిన సుమిత్‌ నిరూపించారు. పుట్టుకతో అంధుడైన సుమిత్‌ పట్టుదలగా ప్రభుత్వ ఉద్యోగం సాధించడమేకాక.. ఎవరి సహాయం లేకుండా సులభంగా కంప్యూటర్‌ ఆపరేట్‌ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. బెళగావిలోని గోకక్‌ ప్రాంతానికి చెందిన సుమిత్‌ మోతేకర్‌ చిన్నప్పటి నుంచి ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ కష్టపడి చదివారు. 2021లో బెళగావి మున్సిపల్‌ కార్పొరేషనులోని ఆరోగ్య విభాగంలో కొలువు సాధించారు. ‘నాన్‌ డెస్క్‌టాప్‌ విజువల్‌ ఎక్సెల్‌’ అనే అప్లికేషన్‌ను ఉపయోగించి ఈయన కంప్యూటర్‌ను ఆపరేట్‌ చేస్తారు. పై అధికారులు ఫోను చేస్తే.. ‘టాక్‌ బ్యాక్‌’ యాప్‌ సహాయంతో ఎవరు ఫోను చేస్తున్నారో తెలుసుకొని స్పందిస్తారు. కర్ణాటక తరఫున జాతీయస్థాయి అంధుల కుస్తీ పోటీల్లో, లక్షద్వీప్‌లో జరిగిన ఫుట్‌బాల్‌ టోర్నీల్లో రెండుసార్లు ఈయన పాల్గొన్నారు. సాహిత్యం మీద మక్కువతో పలు వ్యాసాలు, కథలు కూడా రాశారు. చక్కగా విధులు నిర్వహించే సుమిత్‌ ఎందరికో స్ఫూర్తిదాయకమని బెళగావి మున్సిపల్‌ కమిషనర్‌ అశోక్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని