Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Jul 2023 09:12 IST

1. ‘వాలంటీర్లను మానిపించేద్దామా చెప్పండి?’

వాలంటీర్లను మానిపించేద్దామా చెప్పండి అని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజలను ప్రశ్నించారు.గార మండలం సతివాడ, కొర్లాం సచివాలయాల పరిధిలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఎన్నికల ముందు మీకు చెప్పినవన్నీ చేశాం. మరి ఇప్పుడు ఓ సినిమా యాక్టర్‌ వచ్చి వాలంటీర్లు పనికిమాలినవారని తిడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆ భయం పోవాలంటే..

ఫెయిల్‌ అవుతామేమో.. నవ్వుతారేమో.. తక్కువగా అంచనా వేస్తారేమో.. ప్రెజెంటేషన్‌, ఆఫీస్‌ మీటింగ్‌ ఎక్కడ మాట్లాడాలన్నా కాస్త కంగారుపడే అమ్మాయిలే ఎక్కువ. ‘అమ్మాయివి ఇలా ఉండొద్దు.. అలా చేయొద్దు’ అన్న మాటలు ప్రభావం చూపడమూ అందుకు కారణమే! వీటన్నింటినీ దాటి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలా.. మీ చేతుల్లోనే ఉందంటున్నారు నిపుణులు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆదాయపు పన్నురిఫండు రావాలంటే

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు జులై 31 చివరి తేదీ. ఇప్పటికే రిటర్నులు సమర్పించిన వారికి ఆదాయపు పన్ను విభాగం రిఫండులనూ అందించింది. చాలామంది చెల్లించిన పన్ను మొత్తం రిఫండు రూపంలో అందుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం మోసపూరిత మినహాయింపులను క్లెయిం చేసుకుంటున్నారు. ఐటీ విభాగం ఇలాంటి వారిని అడ్డుకునేందుకు సరికొత్త సాంకేతికతలను వినియోగిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రాణాలు తీస్తున్న టమాటా ధర!

టమాటా రైతులకు కొత్త చిక్కులు వచ్చాయి. సాధారణంగా పంటకు ధర పెరిగితే ఆనందపడతారు..కానీ ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తోటల్లోని పంటను ఎత్తుకెళ్లటం.. ఇద్దరు రైతులు హత్యకు గురికావటం వంటి పరిణామాలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. అరుదైన జపాన్‌ రకం మామిడి కాయ రూ.21 వేల ధర పలకడంతో.. మధ్యప్రదేశ్‌లో వాటిని సాగు చేసిన రైతు తోటలకు కాపలాగా గార్డులతోపాటు తొమ్మిది కుక్కలను పెట్టుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మేము ఫ్లెక్సీలేస్తే జగన్‌కు గుండెపోటే

‘పాదయాత్ర ప్రారంభంలో అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. నన్ను అడ్డుకోమని పోలీసులను ఉసిగొల్పి పంపారు. ప్రసంగిస్తున్న స్టూల్‌ను కూడా లాక్కున్నారు. అయినప్పటికీ నేను తగ్గలేదు. ఇప్పుడు కొత్త నాటకాలు మొదలెట్టారు. యువగళం పాదయాత్ర మొత్తం లైవ్‌లో వస్తుందని తెలియక ఐప్యాక్‌ సభ్యులను పంపుతున్నారు. వాళ్లను తెలుగు తమ్ముళ్లు గుర్తించి పట్టేశారు. చేసేదేమీలేక వాలంటీర్లను సైకో జగన్‌ రంగంలోకి దింపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వీధుల్లో విక్రయించే ఆహారానికీ నాణ్యతా నిబంధనల వర్తింపు: కేంద్రం యోచన

బజ్జీలు, పునుగులు, పకోడీ తదితర చిరుతిళ్లతో పాటు అల్పాహారాలు, ఇతర ఆహార పదార్థాలు అందించే వీధి వ్యాపారులూ నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. నాణ్యత నిబంధనల నియంత్రణల పరిధిలోకి ఆ వ్యాపారులను తీసుకురావడంపై మార్గాన్వేషణ చేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ గురువారం వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సీఎం ఇలాకా.. ఇసుక మిగలదిక!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో గత నాలుగేళ్లుగా ఇసుక అక్రమ తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. పెన్నానదిలో వల్లూరు మండలం చెరువుకిందపల్లె, ఖాజీపేట మండలం కొమ్మలూరు, చెన్నముక్కపల్లె, జమ్మలమడుగుతోపాటు పాపఘ్ని నదిలో పెండ్లిమర్రి మండలం కొత్తగంగిరెడ్డిపల్లె ఇసుక రేవులకు మాత్రమే అనుమతులున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఓటుందో.. లేదో చూసుకుందామా..

రానున్న ఎన్నికలు చాలా కీలకమైనవి. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేవి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితాలో అవకతవకలు, అక్రమాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఓటర్లు, ప్రతిపక్ష పార్టీలపై ఉంది. జాబితాలో పేరుందా? లేదా? అని తనిఖీ చేసుకోవడం ఓటర్ల కనీస బాధ్యత. ఏమాత్రం అలక్ష్యం చేసినా.. రాబోయే ఎన్నికల్లో ఓటేసే అవకాశం కోల్పోనున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. విద్యార్థులూ.. తొందరపడొద్దు!

‘ఏపీ ఈసెట్‌ ఫలితాలు వెలువడ్డాయి... ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం తేదీని ఖరారు చేసింది... ఏ ర్యాంకు వచ్చింది... ఎక్కడ సీటు వస్తోంది... జిల్లాలో ఉన్న కళాశాలల్లో ఏది మంచిది... ఇక్కడ చదవాలా... ఇతర ప్రాంతాలకు వెళ్లాలా... ఏ బ్రాంచి ఎంపిక చేసుకుంటే భవిష్యత్తు బాగా ఉంటోందనే దానిపై విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు ఇప్పటికే దృష్టిసారించారు... బ్రాంచి ఎంపికల్లో ఏ మాత్రం తొందర పడొద్దని నిపుణులు సూచిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వానలు.. వ్యాధులు.. లక్షణాలు.. జాగ్రత్తలు..

వానలతో వ్యాధులు ముప్పు పొంచి ఉంది. దోమలు, ఈగల బెడదతోపాటు కలుషిత నీళ్ల కారణంగా రోగాలు ప్రబలుతాయి. వ్యాధులు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు సూచించిన వివరాలివీ.. ఈ సీజన్‌లో వచ్చే జబ్బుల్లో అత్యంత సమస్యాత్మకమైనది. ఈ జ్వరానికి కారణమయ్యే ‘ప్లాస్మోడియం’ పరాన్నజీవి ఆడ అనాఫిలస్‌ దోమ ద్వారా వ్యాపిస్తుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని