వీధుల్లో విక్రయించే ఆహారానికీ నాణ్యతా నిబంధనల వర్తింపు: కేంద్రం యోచన

బజ్జీలు, పునుగులు, పకోడీ తదితర చిరుతిళ్లతో పాటు అల్పాహారాలు, ఇతర ఆహార పదార్థాలు అందించే వీధి వ్యాపారులూ నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

Updated : 21 Jul 2023 07:56 IST

దిల్లీ: బజ్జీలు, పునుగులు, పకోడీ తదితర చిరుతిళ్లతో పాటు అల్పాహారాలు, ఇతర ఆహార పదార్థాలు అందించే వీధి వ్యాపారులూ నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. నాణ్యత నిబంధనల నియంత్రణల పరిధిలోకి ఆ వ్యాపారులను తీసుకురావడంపై మార్గాన్వేషణ చేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ గురువారం వెల్లడించారు. ఇది కష్టతరమైన వ్యవహారమే అయినప్పటికీ అమలులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇదే అంశంలో ఇతర దేశాల్లో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో సమాచారాన్ని సేకరిస్తామని తెలిపారు. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిర్వహించిన ప్రపంచ ఆహార నియంత్రణల సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని