logo

‘వాలంటీర్లను మానిపించేద్దామా చెప్పండి?’

వాలంటీర్లను మానిపించేద్దామా చెప్పండి అని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజలను ప్రశ్నించారు.గార మండలం సతివాడ, కొర్లాం సచివాలయాల పరిధిలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది.

Published : 21 Jul 2023 06:01 IST

ప్రసంగిస్తున్న మంత్రి ధర్మాన, వేదికపై వైకాపా నాయకులు

గార, న్యూస్‌టుడే: వాలంటీర్లను మానిపించేద్దామా చెప్పండి అని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజలను ప్రశ్నించారు.గార మండలం సతివాడ, కొర్లాం సచివాలయాల పరిధిలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఎన్నికల ముందు మీకు చెప్పినవన్నీ చేశాం. మరి ఇప్పుడు ఓ సినిమా యాక్టర్‌ వచ్చి వాలంటీర్లు పనికిమాలినవారని తిడుతున్నారు. ఆయనకు తెలియాలి కదా.. ఇలాంటివి వచ్చి చూస్తే తెలుస్తుంది. సినిమా వేరు.. నిజ జీవితం వేరు.. ప్రజల జీవన విధానాన్ని పరిశీలించినోడికి మాత్రమే అది తెలుస్తుంది. వాలంటీర్లు వేస్టు అంటున్నారు.. నిజమేనా.. వాళ్లని మాన్పించేద్దామా.. చెప్పండి.’ అని అన్నారు. దీనికి ఒక మహిళ స్పందిస్తూ లేదు.. వాలంటీర్లు ఉండాలని చెప్పారు. ఎన్నికలప్పుడు ఓటేస్తే బ్యాంకుల్లో అప్పులు తీర్చేస్తానని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తరువాత అయిదేళ్లు కనిపించకుండా పోయారని మంత్రి విమర్శించారు. మాట మీద నిలబడిన ప్రభుత్వాన్ని తీసుకువచ్చేలా ఆలోచన చేయాలని సూచించారు. అనంతరం లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందజేశారు. ఎంపీపీ గొండు రఘురాం, ప్రత్యేకాధికారి రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని