Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 22 Jul 2023 09:13 IST

1. మరో సలహాదారుడొచ్చారు

ఆంధ్రప్రదేశ్‌కు మరో సలహాదారుడు వచ్చారు. సలహాదారుల నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసినా ఎలాంటి మార్పు లేదు. రాష్ట్ర అధినేత తలుచుకుంటే  సలహాదారుల పోస్టులకు కొదవా అన్నట్లు పరిస్థితి మారింది. తాజాగా జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి మరో సలహాదారుడిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే, శాసన మండలి మాజీ విప్‌ గంగుల ప్రభాకర్‌రెడ్డిని జలవనరుల శాఖ సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. దోస్త్‌ ప్రవేశాల షెడ్యూల్‌లో మార్పు

దోస్త్‌ ప్రవేశాలకు సంబంధించి ఆయా తేదీల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఏకధాటి వర్షాల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా గడువు పెంచారు. మూడో విడతలో సీట్లు పొందిన వారు ఈనెల 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌, అన్ని విడతల్లో సీట్లు సాధించిన విద్యార్థులు ఈ నెల 26వ తేదీ లోపు కళాశాలల్లో స్వయంగా రిపోర్ట్‌ చేయాలని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మణిపుర్‌లో వెలుగులోకి మరో దారుణం!.. ఈ నెల 2న ఘటన

జాతుల మధ్య వైరంతో అట్టుడికిపోతున్న మణిపుర్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుకీ తెగకి చెందిన ఓ వ్యక్తి తలను నరికిన దుండగులు...దానిని వెదురు కర్రలతో చేసిన కంచెకు వేలాడ దీశారు. భయంకరమైన ఈ దృశ్యాలతో కూడిన వీడియో ఒకటి శుక్రవారం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. బిష్ణుపుర్‌ జిల్లాలోని ఓ నివాసిత ప్రాంతంలో ఈ నెల 2న ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఆ రోజు రాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రజల వ్యక్తిగత డేటా ఎవరు సేకరించమన్నారు?

‘‘వాలంటీర్లకు బాస్‌ ఎవరు? ప్రజల వ్యక్తిగత డేటా సేకరించాలని వారికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ప్రైవేటు కంపెనీయా? ఒకవేళ అదే అయితే దాని అధినేత ఎవరు? అలాకాకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే ఆ ఆదేశాలు ఇచ్చిందా? అలాగైతే ఆ ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శా? ముఖ్యమంత్రా? కలెక్టరా? ఎమ్మెల్యేనా? ఎవరు?’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విటర్‌లో ప్రశ్నలు సంధించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నమ్మండి.. హాలీవుడ్‌ భామలేనండీ!

స్కార్లెట్‌ జొహాన్సన్‌, ఎమిలియా క్లార్క్‌, నటాలీ పోర్ట్‌మన్‌, సల్మా హయెక్‌, ఎమ్మా వాట్సన్‌, జెండాయా.. జగమెరిగిన హాలీవుడ్‌ నాయికలు. తమ అందంతో కుర్రాళ్ల గుండెల్లో తుపాను రేపే భామలు. వీళ్లంతా కాషాయం కట్టి, ఒళ్లంతా చీర చుడితే ఎలా ఉంటుంది? కలలో కూడా ఇది ఊహకు అందదు. రియల్‌ లైఫ్‌లో కాదు కదా.. కనీసం రీల్‌ లైఫ్‌లోనూ సాధ్యం కాదు కదూ!పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమ్మఒడికి ఎన్నాళ్లీ నిరీక్షణ?

అమ్మఒడి పథకం నిధుల జమ కోసం లబ్ధిదారుల నిరీక్షణ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కి మూడు వారాలు దాటినా కొందరికి పూర్తిగా డబ్బులు అందకపోగా.. మరికొందరి ఖాతాల్లో కొంతమేర నగదు జమైంది. దీంతో మహిళలు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. తమ చిన్నారుల పేర్లు అర్హుల జాబితాలో ఉన్నా ఇంత జాప్యం జరగడానికి కారణాలేంటని ప్రశ్నిస్తున్నా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది నుంచి సరైన సమాధానం రావడంలేదని అంటున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. జలదిగ్బంధంలో లంకలు

వారం క్రితం వరకు ప్రశాంతంగా ఉన్న గోదావరి.. ఇప్పుడు భారీ వరద ప్రవాహంతో కనిపిస్తోంది. ఎగువ, పరీవాహక ప్రాంతాల్లో విస్తృత వర్షాల నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద భారీగా నీరు చేరుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు ఇక్కడ 11.70 అడుగుల నీటిమట్టం నమోదవగా 9,73,870 క్యూసెక్కుల జలాలు సముద్రంలోకి విడిచిపెట్టారు. రాత్రి 10 గంటలకు కూడా ఇదే నిలకడ కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నిజమేనండి.. ఈ రోడ్డేసి తొమ్మిది నెలలే...

గ్రామీణులు కొన్నేళ్లుగా గుంతలు పడిన రహదారిలో ప్రయాణానికి నరకయాతన అనుభవించారు.. రోడ్డు వేసినందున తమ కష్టాలు తీరాయన్న ఆనందం వారిలో ఏడాది కాలమైన నిలవలేదు. గతానికి కంటే దారుణంగా పైకితేలిన కంకర రాళ్లు.. కొన్నిచోట్ల మోకాలిలోతు గుంతలు.. లోపలకు కుంగి ఎగుడుదిగుడుగా మారి.. రోడ్డంతా పగుళ్లిచ్చి అధ్వానంగా మారింది. వర్షాకాలంలో గుంతల్లో నీరు చేరి వాహన చోదకులు నరకయాతన అనుభవిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కడపలో సిటీ బస్సులు తిప్పలేరా?

వైయస్‌ఆర్‌ జిల్లా కేంద్రమైన కడప నగరానికి జిల్లాతోపాటు పక్క జిల్లా అన్నమయ్య నుంచి నిత్యం వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు నగరంలోని ప్రధాన ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు సిటీ బస్సుల్లేక ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. సీఎం జగన్‌, ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లికార్జునరెడ్డి జిల్లాకు చెందినవారైనా సిటీ బస్సు సర్వీసులు లేకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రెండు జిల్లాల నుంచి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి పెద్దసంఖ్యలో రోగులు, సహాయకులు తరలివస్తుంటారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నేడు పాస్‌పోర్టు సేవలు యథాతథం

వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినా.. పాస్‌పోర్టు స్పెషల్‌ డ్రైవ్‌ శనివారం యథాతథంగా కొనసాగుతుందని పాస్‌పోర్టు ప్రాంతీయ అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు. శనివారం 3,700 మంది పాస్‌పోర్టు సేవలకు దరఖాస్తు చేసుకున్నారని.. వీరంతా ఎంపిక చేసుకున్న మేరకు రాష్ట్రంలోని ప్రాంతీయ పాస్‌పోర్టు సేవాకేంద్రాలు, 14 తపాలా కార్యాలయాల్లోని పాస్‌పోర్టు కేంద్రాలకు వెళ్లి సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని