DOST: దోస్త్‌ ప్రవేశాల షెడ్యూల్‌లో మార్పు

దోస్త్‌ ప్రవేశాలకు సంబంధించి ఆయా తేదీల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఏకధాటి వర్షాల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా గడువు పెంచారు.

Updated : 22 Jul 2023 09:30 IST

ఈనాడు, హైదరాబాద్‌: దోస్త్‌ ప్రవేశాలకు సంబంధించి ఆయా తేదీల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఏకధాటి వర్షాల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా గడువు పెంచారు. మూడో విడతలో సీట్లు పొందిన వారు ఈనెల 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌, అన్ని విడతల్లో సీట్లు సాధించిన విద్యార్థులు ఈ నెల 26వ తేదీ లోపు కళాశాలల్లో స్వయంగా రిపోర్ట్‌ చేయాలని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. కళాశాలలో చేరిన వారు మరో బ్రాంచిలోకి మారేందుకు ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఇంట్రా కాలేజ్‌ ప్రక్రియ జరుగుతుందని, వారికి ఆగస్టు 1న సీట్లు కేటాయిస్తామని దోస్త్‌ అధికారులు ప్రకటించారు.

ఎంసెట్‌ ప్రవేశాల ఫీజు గడువు పెంపు

వర్షాలను దృష్టిలో ఉంచుకొని, ఎంసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ట్యూషన్‌ ఫీజు చెల్లించి, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసే గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని