మరో సలహాదారుడొచ్చారు

ఆంధ్రప్రదేశ్‌కు మరో సలహాదారుడు వచ్చారు. సలహాదారుల నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసినా ఎలాంటి మార్పు లేదు.

Published : 22 Jul 2023 03:54 IST

న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా.. కొనసాగుతున్న నియామకాలు
గంగుల ప్రభాకర్‌రెడ్డికి జలవనరుల శాఖ సలహాదారు పదవి

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మరో సలహాదారుడు వచ్చారు. సలహాదారుల నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసినా ఎలాంటి మార్పు లేదు. రాష్ట్ర అధినేత తలుచుకుంటే  సలహాదారుల పోస్టులకు కొదవా అన్నట్లు పరిస్థితి మారింది. తాజాగా జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి మరో సలహాదారుడిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే, శాసన మండలి మాజీ విప్‌ గంగుల ప్రభాకర్‌రెడ్డిని జలవనరుల శాఖ సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జలవనరులకు సంబంధించి ఎందరో నిపుణులు ఉండగా ఏ ప్రాతిపదికన మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్‌రెడ్డి సలహాదారుడిగా  నియమితులయ్యారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు