ప్రజల వ్యక్తిగత డేటా ఎవరు సేకరించమన్నారు?

‘‘వాలంటీర్లకు బాస్‌ ఎవరు? ప్రజల వ్యక్తిగత డేటా సేకరించాలని వారికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ప్రైవేటు కంపెనీయా? ఒకవేళ అదే అయితే దాని అధినేత ఎవరు? అలాకాకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే ఆ ఆదేశాలు ఇచ్చిందా? అలాగైతే ఆ ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శా? ముఖ్యమంత్రా? కలెక్టరా? ఎమ్మెల్యేనా? ఎవరు?’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు.

Published : 22 Jul 2023 06:14 IST

ముఖ్యమంత్రా.. ప్రైవేటు కంపెనీ అధినేతా?
ట్విటర్‌లో పవన్‌ కల్యాణ్‌ నిలదీత

ఈనాడు, అమరావతి: ‘‘వాలంటీర్లకు బాస్‌ ఎవరు? ప్రజల వ్యక్తిగత డేటా సేకరించాలని వారికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ప్రైవేటు కంపెనీయా? ఒకవేళ అదే అయితే దాని అధినేత ఎవరు? అలాకాకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే ఆ ఆదేశాలు ఇచ్చిందా? అలాగైతే ఆ ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శా? ముఖ్యమంత్రా? కలెక్టరా? ఎమ్మెల్యేనా? ఎవరు?’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విటర్‌లో ప్రశ్నలు సంధించారు. ప్రజల డేటా సేకరిస్తున్న విషయంలో వైకాపా ప్రభుత్వం తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని కోరారు. ఈ ట్వీట్‌కు ప్రధానమంత్రి కార్యాలయాన్ని, కేంద్ర హోంమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్‌ చేశారు. మరో ట్వీట్‌లో నెల్లూరు ఎస్పీ కె.తిరుమలేశ్వర్‌రెడ్డి జూన్‌ 27న విలేకర్ల సమావేశంలో చెప్పిన అంశాలను జతచేశారు. అందులో ఎస్పీ మాట్లాడుతూ లీకైన ఒక వేలిముద్ర ఆధారంగా నకిలీ వేలిముద్ర తయారుచేసి ఆధార్‌ నంబరు ఆధారంగా ఒక ఖాతాలో నుంచి వారి ఖాతాకు రూ.51.25 లక్షలు బదిలీ చేసుకున్నారని వెల్లడించారు. ప్రజల డేటా పక్కదోవ పడితే ఎంత ప్రమాదమో వివరించేందుకు పవన్‌కల్యాణ్‌ ఈ వీడియోను జతచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని