నమ్మండి.. హాలీవుడ్‌ భామలేనండీ!

స్కార్లెట్‌ జొహాన్సన్‌, ఎమిలియా క్లార్క్‌, నటాలీ పోర్ట్‌మన్‌, సల్మా హయెక్‌, ఎమ్మా వాట్సన్‌, జెండాయా.. జగమెరిగిన హాలీవుడ్‌ నాయికలు. తమ అందంతో కుర్రాళ్ల గుండెల్లో తుపాను రేపే భామలు.

Published : 22 Jul 2023 00:47 IST

స్కార్లెట్‌ జొహాన్సన్‌, ఎమిలియా క్లార్క్‌, నటాలీ పోర్ట్‌మన్‌, సల్మా హయెక్‌, ఎమ్మా వాట్సన్‌, జెండాయా.. జగమెరిగిన హాలీవుడ్‌ నాయికలు. తమ అందంతో కుర్రాళ్ల గుండెల్లో తుపాను రేపే భామలు. వీళ్లంతా కాషాయం కట్టి, ఒళ్లంతా చీర చుడితే ఎలా ఉంటుంది? కలలో కూడా ఇది ఊహకు అందదు. రియల్‌ లైఫ్‌లో కాదు కదా.. కనీసం రీల్‌ లైఫ్‌లోనూ సాధ్యం కాదు కదూ! కానీ ఇది ఏఐ కాలం గురూ.. ఏదైనా సాధ్యమే. వైల్డ్‌ ట్రాన్స్‌ అనే కళాకారుడు కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్‌ మిడ్‌జర్నీతో ఇదిగో వారిని ఇలా సృష్టించాడు. దుస్తుల విషయంలో ఒంటిపై పొదుపు పాటించే ఈ హాలీవుడ్‌ స్టార్లు నుదుటన బొట్టు, చేతికి గాజులు, మెడలో రుద్రాక్షలు.. ధరించి మహా సాధ్వీమణుల్లాగే కనిపిస్తున్నారు. అన్నట్టు ఇందులో కొందరు తారలు గతంలో భారత్‌ సందర్శించి ఆధ్యాత్మిక ప్రశాంతతతో పరవశించినవాళ్లే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని