Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 26 Jul 2023 09:16 IST

1. సంపూర్ణ ‘జగన్‌ ప్రచార పథకం!’

గర్భిణులు, బాలింతలకు జులై 1 నుంచి బియ్యం, కందిపప్పు, నూనె, కోడిగుడ్లు, పాలు, రాగిపిండి, అటుకులు తదితర సరకులు ఇంటికే ఇస్తామని జూన్‌లో ఉత్తర్వులిచ్చారు. సరకులను సంచుల్లో ఇవ్వాలని నిర్ణయించారు. ఈమేరకు సంచిపై సీఎం జగన్‌ బొమ్మ, నవరత్నాల ముద్ర ఉండేలా నమూనా రూపొందించారు. జిల్లాల వారీగా తయారీకి టెండర్లు పిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరు లక్షలకు పైగా గర్భిణులు, బాలింతలు సేవలు పొందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. YSRCP: పదవిచ్చి పరువు తీసేశారు!

కొయ్యూరు మండలానికి చెందిన జైతి రాజులమ్మ వైకాపాలో చురుగ్గా వ్యవహరించారు. ఈమె సేవలకు గుర్తింపుగా చింతపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ పదవి దక్కింది. వ్యవసాయ పరంగా ప్రాధాన్యమున్న పదవే అయినా ఆ గుర్తింపు దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌ యార్డ్‌ పరిధిలోని చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల్లో అధికారులు, పాలకులు, నాయకులు కనీసం విత్తనాలు పంచే కార్యక్రమాలకూ పిలవడం లేదంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భారతీయ నిపుణులకు బ్రిటన్‌ వీసా

భారతీయ గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు బ్రిటన్‌లో రెండేళ్లపాటు నివసిస్తూ చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి వీలు కల్పించే యూకే-ఇండియా యువ వృత్తి నిపుణుల పథకం కింద రెండో బ్యాలట్‌ను బ్రిటన్‌ ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. బ్యాలట్‌ జూలై 27తో ముగుస్తుంది. ఈ పథకం కింద దాదాపు 3 వేల మంది భారతీయ ఉన్నత విద్యావంతులు 2023 సంవత్సరానికి బ్రిటన్‌లో ప్రవేశానికి వీసా పొందగలుగుతారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. త్వరలో ‘ఇండియాసైజ్‌’ దుస్తులు

‘రెడీమేడ్‌ దుస్తులు మా శరీరాకృతికి అనుగుణంగా లేవు’ అనే మాట తరచు దేశీయుల నుంచి వినపడుతుంటుంది. ప్రస్తుతం దేశీయంగా లభ్యమవుతున్న అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్లకు అమెరికా లేదా బ్రిటన్‌ ప్రమాణాలైన స్మాల్‌(ఎస్‌), మీడియం(ఎమ్‌), లార్జ్‌(ఎల్‌) సైజులను వినియోగిస్తున్నారు.  పాశ్చాత్య వ్యక్తుల శరీరాకృతికి అనుగుణంగా అవి ఉంటాయి. వారితో పోలిస్తే ఎత్తు, లావు సహా పలు అంశాల్లో మన దేశీయుల శరీరాకృతి కాస్త భిన్నంగా ఉంటుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చిత్రం.. దారితప్పితే చేటే!

నగరానికి చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ రీల్స్‌ చేస్తుంటుంది. ఫాలోవర్లు వేల సంఖ్యలో ఉన్నారు. కొత్త సినిమా పాటలపై డ్యాన్సులు, డబ్‌స్మాశ్‌లు చేస్తూ ఓ వీడియో తన ఖాతాలో పోస్టు చేసింది. అందులో ఆమె పారదర్శకంగా ఉండే దుస్తులు ధరించింది. తొలుత ఈ విషయాన్ని గమనించలేదు. సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్‌గా మారాక పొరపాటు గుర్తించి వీడియో తొలగించినా ప్రయోజనం లేకుండా పోయింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. టీకా వేయించారా?

కరోనా సృష్టించిన కల్లోలంతో ‘వ్యాధినిరోధక టీకా’ పేరు బాగా ప్రాచుర్యం పొందింది. కొవిడ్‌ టీకాను పక్కనపెడితే పుట్టిన పిల్లల నుంచి 16 ఏళ్లలోపు వారందరికీ వివిధ రకాల వ్యాధుల నివారణకు వ్యాక్సినేషన్‌ తప్పనిసరి. గర్భిణులు సైతం విధిగా టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే టీకాలు తీసుకోకుండా మిగిలిన వారికోసం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ‘మిషన్‌ ఇంద్రధనుష్‌’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఈ పాపం ఇసుకాసురులదే !

ఇసుకాసురులు సహజ వనరులను దోచుకుని పర్యావరణానికి హాని తలపెట్టడమే కాకుండా ప్రజల ప్రాణాలు కూడా బలి తీసుకుంటున్నారు. ఇదే నెల 11న హన్వాడ మండలం చిర్మల్‌కుచ్చతండాలో ఫిల్టర్‌ ఇసుక తయారీకి తవ్విన నీటిగుంతలో పడి శివ, గణేశ్‌ అనే ఇద్దరు గిరిజన చిన్నారులు మృతిచెందారు. ఆ ఘటన మరవక ముందే మరో విషాదం చోటు చేసుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గవర్నర్‌ దత్తత గ్రామంలో.. సాగని చదువులు

ఆవరణంతా దట్టంగా పెరిగిన పిచ్చి మొక్కలతో అధ్వానంగా ఉన్న ఈ చిత్రాన్ని చూస్తే ఇదేదో మూసి వేసిన పాఠశాల భవనం అనుకుంటారు. కానీ ఈ భవనం ఉన్న గ్రామానికి రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై దత్తత గ్రామంలోని బడి దుస్థితి ఇది. మారుమూల అటవీ ప్రాంతాల్లో జీవనం సాగించే కొండరెడ్ల జీవన విధానాన్ని మెరుగుపర్చేందుకు రాష్ట్రంలో మూడు జిల్లాల్లో ఆరు కొండరెడ్ల గ్రామాలను రాష్ట్ర గవర్నర్‌ దత్తత తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఎప్పుడొస్తాయో.. ఎగిరే కార్లు!

ఎగిరే కార్లు.. ఈ ఊహే అద్భుతం కదూ.. త్వరలోనే ఇది సాకారం కానున్నట్లు రూపకర్తలు ఇటీవల ప్రకటించారు. దీని సాధ్యాసాధ్యాల విషయం పక్కన పెడితే ఇలాంటి వాహనాలు అందుబాటులోకి వస్తే గానీ జిల్లా వాసుల కష్టాలు తీరేలా లేవు. ఎందుకంటే ఇక్కడి రహదారులపై ప్రయాణమంటే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. అడుగడుగునా గుంతలు.. వాటిలో వాననీరు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆకాశమే హద్దు!

ఆకాశమే హద్దుగా ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. చంద్రయాన్‌-3ని విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టిన ఇస్రో పలు కీలక, భారీ ప్రయోగాలు వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించింది. కీలకమైన ఆదిత్య-ఎల్‌1ను ఆగస్టులో ప్రయోగించనుండగా వచ్చే ఏడాదిలో నిసార్‌, స్పాడెక్స్‌, మంగళయాన్‌-2, గగన్‌యాన్‌ తోడు శుక్రయాన్‌-1 ప్రయోగం చేపట్టడంపైనా దృష్టి కేంద్రీకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని