త్వరలో ‘ఇండియాసైజ్‌’ దుస్తులు

‘రెడీమేడ్‌ దుస్తులు మా శరీరాకృతికి అనుగుణంగా లేవు’ అనే మాట తరచు దేశీయుల నుంచి వినపడుతుంటుంది

Published : 26 Jul 2023 02:28 IST

మన శరీరాకృతికి తగ్గట్లుగా మార్పులు

దిల్లీ: ‘రెడీమేడ్‌ దుస్తులు మా శరీరాకృతికి అనుగుణంగా లేవు’ అనే మాట తరచు దేశీయుల నుంచి వినపడుతుంటుంది. ప్రస్తుతం దేశీయంగా లభ్యమవుతున్న అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్లకు అమెరికా లేదా బ్రిటన్‌ ప్రమాణాలైన స్మాల్‌(ఎస్‌), మీడియం(ఎమ్‌), లార్జ్‌(ఎల్‌) సైజులను వినియోగిస్తున్నారు.  పాశ్చాత్య వ్యక్తుల శరీరాకృతికి అనుగుణంగా అవి ఉంటాయి. వారితో పోలిస్తే ఎత్తు, లావు సహా పలు అంశాల్లో మన దేశీయుల శరీరాకృతి కాస్త భిన్నంగా ఉంటుంది. దీంతో ఫిట్టింగ్‌లో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఈ ఇబ్బందులు తీరేలా, భారతీయుల శరీరాకృతులకు తగ్గట్లుగా త్వరలోనే ‘ఇండియాసైజ్‌’ పేరిట పరిమాణాలు, ప్రమాణాలను ఆవిష్కరించనున్నట్లు జౌళి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందుకనుగుణంగా దుస్తులు రూపొందితే, అత్యధికులకు సౌకర్యవంతంగా ఉంటుందని  జౌళి కార్యదర్శి రచన షా పేర్కొన్నారు.  

* దేశీయ సాంకేతిక జౌళి విభాగాన్ని ప్రస్తుత 22 బిలియన్‌ డాలర్ల స్థాయి నుంచి, అయిదేళ్లలో 40-50 బి. డాలర్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఎగుమతులను 2.5 బి. డాలర్ల నుంచి 10 బి. డాలర్లకు చేర్చాలని భావిస్తున్నట్లు వివరించారు. అంతర్జాతీయంగా సాంకేతిక జౌళి మార్కెట్‌ 250-260 బి. డాలర్లుగా ఉండగా.. 2025-26 కల్లా 320-325 బి. డాలర్లకు చేరొచ్చని ఆమె అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు