YSRCP: పదవిచ్చి పరువు తీసేశారు!

చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించడమే లేదు. ఎంపీడీఓలు, ఎంపీపీలే కాదు.. చివరికి మా పార్టీ నాయకులు కూడా నన్ను మర్చిపోయారు.

Updated : 26 Jul 2023 09:19 IST

చింతపల్లి మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ రాజులమ్మ అసహనం

గూడెం కొత్తవీధి, న్యూస్‌టుడే: చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించడమే లేదు. ఎంపీడీఓలు, ఎంపీపీలే కాదు.. చివరికి మా పార్టీ నాయకులు కూడా నన్ను మర్చిపోయారు. కనీసం విత్తనాల పంపిణీకి కూడా పిలవడం లేదు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ పదవి అంటే ఏంటో అర్థం కాని పరిస్థితికి తీసుకువచ్చారు. ఛైర్‌పర్సన్‌ కాకముందే బాగుండేది. పదవిచ్చి పరువు తీసిపడేశారు. నాకు ముందు పనిచేసిన వారికీ ఇదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను.

వైకాపా నాయకుల తీరుపై జైతి రాజులమ్మ ఆవేదన

కొయ్యూరు మండలానికి చెందిన జైతి రాజులమ్మ వైకాపాలో చురుగ్గా వ్యవహరించారు. ఈమె సేవలకు గుర్తింపుగా చింతపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ పదవి దక్కింది. వ్యవసాయ పరంగా ప్రాధాన్యమున్న పదవే అయినా ఆ గుర్తింపు దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌ యార్డ్‌ పరిధిలోని చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల్లో అధికారులు, పాలకులు, నాయకులు కనీసం విత్తనాలు పంచే కార్యక్రమాలకూ పిలవడం లేదంటున్నారు. గూడెంకొత్తవీధిలో సోమవారం జరిగిన రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవానికి, మంగళవారం జరిగిన సంకాడ గ్రామ సచివాలయం భవనం ప్రారంభోత్సవానికీ తనను ఏ నాయకుడు, అధికారి పిలవలేదని పేర్కొన్నారు. తాను ప్రమాణ స్వీకారం చేసి ఏడు నెలలైనా గూడెంకొత్తవీధి ఎంపీడీఓ ఒక్కసారి కూడా తనను ఏ కార్యక్రమానికీ ఆహ్వానం అందించలేదన్నారు. చింతపల్లి ఎంపీడీఓగా సీతయ్య ఉన్నప్పుడు సమాచారం అందించేవారని తెలిపారు. ఇప్పుడు అక్కడున్న అధికారికి తానెవరో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. పదవి ఇచ్చినా పరువు లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని