Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 31 Jul 2023 09:16 IST

1. కొన్నే ఉన్నాయ్‌... కొనుక్కో అన్నాయ్‌!

విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలోని ఓపీకి సోమవారం నుంచి శనివారం వరకు నిత్యం 2,500 మందికి పైగా వస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని ప్రాంతాలు, పక్కనే ఉన్న గుంటూరు, ఏలూరు నుంచి కూడా ఓపీకి పెద్దసంఖ్యలో వస్తుంటారు. గ్యాస్ట్రో, ఆర్థో, జనరల్‌ మెడిసిన్‌, ఈఎన్‌టీ, కంటికి సంబంధ సమస్యలతో నిత్యం ఓపీకి వచ్చే రోగులు అత్యధికంగా ఉంటున్నారు. వీరికి వైద్యులు రాసే మందుల్లో ప్రస్తుతం కొన్నే కౌంటర్లలో ఇస్తున్నారు. మిగతావి బయట కొనుక్కోమని చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వారెదుట అలా మాట్లాడొద్దు...

పసివాళ్లుగా ఉన్నప్పటి నుంచే కుటుంబ సభ్యుల హావభావాలను గుర్తించడం మొదలుపెడతారు. భాషా ప్రయోగాలను గమనిస్తారు. అందుకే చిన్నప్పటి నుంచే వారితో మర్యాదగా మాట్లాడటం, ఎదుటివారిని గౌరవించేలా ప్రోత్సహించాలి. కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు, మంచిగా తన అభిప్రాయాలు చెబుతున్నప్పుడు అభినందించాలి. ఇవన్నీ వారిలో మంచి నడవడికను అలవరుస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వరద నీటికి నడక నేర్పేదెప్పుడు?

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరాలు, పట్టణాలు జలమయం అవుతున్నాయి. తక్కువ వ్యవధిలో ఎక్కువ మోతాదులో వర్షం కురిసేసరికి అతలాకుతలం అవుతున్నాయి. హైదరాబాద్‌లో చెరువుల్లో ఆక్రమణలు వెల్లువెత్తుతున్నాయి. అదేసమయంలో గతంలో ఎప్పుడో తక్కువ జనాభా కోసం రూపొందించిన వరద కాల్వలు, నాలాలే ఇప్పటికీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిసారీ వరదల ముప్పు తప్పడం లేదు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏడు నెలల చిన్నారి కడుపులో రెండు కిలోల పిండం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ ఆస్పత్రి వైద్యులు ఏడు నెలల బాలుడికి అరుదైన శస్త్రచికిత్స చేసి కడుపులో నుంచి ఆరు నెలల వయసున్న రెండు కిలోల పిండాన్ని తొలగించారు. గత కొద్దిరోజులుగా ఈ బాలుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కడుపు పరిమాణం కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు జిల్లా కేంద్రంలోని చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకువచ్చారు. అల్ట్రాసౌండ్‌ పరీక్షల ద్వారా చిన్నారి కడుపులో రెండు కిలోల పిండాన్ని వైద్యులు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వాయు కాలుష్యంతో మర్చిపోలేని నష్టం

వాయు కాలుష్యం ధాటికి శరీరంలోని అవయవాలన్నీ పొగచూరిపోతున్నాయని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఊపిరితిత్తులు, గుండె వంటి భాగాలనే కాకుండా మెదడునూ అది దారుణంగా దెబ్బతీస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల ఆలోచనశక్తి, విషయగ్రహణ సామర్థ్యం తగ్గుతోందని ఇప్పటికే వెల్లడైంది. స్వల్పస్థాయిలో ఈ కలుషిత గాలి బారినపడ్డా తీవ్ర మతిమరుపు (డిమెన్షియా) ముప్పు పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళనకర అంశాన్ని   బ్రిటన్‌, స్వీడన్‌ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చిట్టితల్లీ.. మన్నించమ్మా!

రెండు రోజుల కిందటిదాకా అదే పాఠశాలలో ఆ చిన్నారి (5) పాఠాలు వల్లె వేసింది. ఆ ఆవరణలోనే తోటి పిల్లలతో కలిసి ఆడుకొంది. ఇపుడు అదేచోట విగతజీవిగా పడున్న ఆ పసిపాపకు వందలాదిగా తరలివచ్చిన జనం కన్నీటి వీడ్కోలు పలికారు. బిహార్‌ వలస కుటుంబాలకు చెందిన ఈ చిన్నారిని అదే సమూహంలోని ఓ కామాంధుడు కాటేశాడు. అభం శుభం తెలియని పాపను శుక్రవారం రాత్రి కిడ్నాప్‌ చేసి, మద్యం మత్తులో తన పైశాచిక కోరిక తీర్చుకొని గొంతు నులిమి చంపేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మునక తప్పదని తెలుసు... అయినా!

దేశ రాజధాని దిల్లీ అతలాకుతలం.. ఇటు హైదరాబాద్‌ మునక... వరద బారిన కోస్తా జిల్లాలు.. ఇదీ ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పరిస్థితి. వరుణుడు ఒక్కసారిగా విరుచుకుపడుతుండడంతో చిన్నా, పెద్దా తేడా లేకుండా ఊళ్లకు ఊళ్లు ఏర్లు ఒక్కటైపోతున్నాయి. అదృష్టం కొద్దీ జిల్లాను ఈ ఏడు ఇప్పటి వరకు వరుణుడు గట్టిగా పలకరించలేదు. ఒకవేళ తుపాను ఏర్పడి భారీ వర్షాలు పడితే మన పరిస్థితి ఏమిటి? ఒక్కసారిగా వచ్చే వరదను నది వైపు మళ్లించే వ్యవస్థలు ఇక్కడ ఉన్నాయా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కన్నీటి చెమ్మ.. తుడిచేదెవరమ్మా?

ఆహార పదార్థాలు డెలివరీ చేసే యువకుడు.. ఫోన్‌ నెంబరు ఆసరా చేసుకొని యువతులకు అశ్లీల చిత్రాలు పంపి వేధించేవాడు. అర్ధరాత్రి దాటాక వాట్సాప్‌లో అసభ్య పదాలతో చాటింగ్‌ చేసేవాడు. అంతర్జాలంలో ఫోన్‌ నెంబర్లు ఉంచి వ్యభిచారిణులుగా ముద్ర వేస్తానంటూ బెదిరించేవాడు. రైతుబజార్‌లో కూరగాయలు కొనేందుకు వెళ్లిన మహిళల చేతులు తాకుతూ కొందరి వెకిలిచేష్టలు.. ఇవీ మహానగరంలో మహిళలు/యువతులు ఎదుర్కొంటున్న వేధింపులకు ఉదాహరణలు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బిల్లు చూస్తేనే... షాక్‌!

అసలే భారీగా వస్తున్న విద్యుత్తు బిల్లులు.. ఎడాపెడా విధిస్తున్న సర్దుబాటు ఛార్జీలతో మరింత భారంగా మారుతున్నాయి. ఒకేసారి మూడు సర్దుబాటు ఛార్జీలను మోపతుండడంతో సామాన్యులు హడలుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రజలపై ఈ ఛార్జీల భారం సుమారు రూ.700 కోట్ల మేర పడుతోంది. భారీగా వస్తున్న కరెంటు బిల్లులు చెల్లించలేక విలవిల్లాడుతున్నారు. పెరుగుతున్న ధరలకు తోడు, ఈ బిల్లులు మరింత కుంగదీస్తున్నాయని వాపోతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇల్లూ లేదు.. సొమ్మూ రాదు..!

అద్దె భారం నుంచి తప్పించుకునేందుకు కష్టమైనా శ్రమపడి కూడబెట్టి.. బంధువుల దగ్గర అధిక వడ్డీలకు అప్పుతెచ్చి మరీ.. సొంత గూడు సమకూరుతుందనే కొండంత ఆశతో ప్రభుత్వానికి ముందస్తుగా డబ్బుకట్టారు. అలాంటి వారికోసం ఇళ్లు నిర్మించి ఇప్పటికే ఏళ్లవుతున్నా.. లబ్ధిదారులకు అప్పగించకపోగా కట్టిన సొమ్ము కూడా తిరిగివ్వలేదు. ఇళ్లు ఎప్పుడిస్తారో తెలియని దుస్థితి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని