ఏడు నెలల చిన్నారి కడుపులో రెండు కిలోల పిండం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ ఆస్పత్రి వైద్యులు ఏడు నెలల బాలుడికి అరుదైన శస్త్రచికిత్స చేసి కడుపులో నుంచి ఆరు నెలల వయసున్న రెండు కిలోల పిండాన్ని తొలగించారు.

Published : 31 Jul 2023 07:54 IST

ఈటీవీ భారత్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ ఆస్పత్రి వైద్యులు ఏడు నెలల బాలుడికి అరుదైన శస్త్రచికిత్స చేసి కడుపులో నుంచి ఆరు నెలల వయసున్న రెండు కిలోల పిండాన్ని తొలగించారు. గత కొద్దిరోజులుగా ఈ బాలుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కడుపు పరిమాణం కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు జిల్లా కేంద్రంలోని చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకువచ్చారు. అల్ట్రాసౌండ్‌ పరీక్షల ద్వారా చిన్నారి కడుపులో రెండు కిలోల పిండాన్ని వైద్యులు గుర్తించారు. పిండానికి చేతులు, పాదాలు, వెంట్రుకలు అభివృద్ధి చెందాయన్నారు. పిండంలో పిండం (ఫీటస్‌-ఇన్‌-ఫీటూ) అనే అరుదైన పరిస్థితిని ఎదుర్కొంటున్న శిశువుకు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తిచేయగా, ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ‘‘ఈ శస్త్రచికిత్స చాలా సంక్లిష్టమైనది. అప్రమత్తంగా లేకపోతే కిడ్నీల నుంచి రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. 10 లక్షల మందిలో ఒకరికి ఇలా జరుగుతుంది. తల్లి గర్భాశయంలో కవలలు వృద్ధి చెందుతున్న దశలో ఏర్పడే       వైకల్యమిది’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు