వారెదుట అలా మాట్లాడొద్దు...

పిల్లలు ఏం చూస్తే అదే నేర్చుకుంటారు. పెద్దల ప్రవర్తనని అనుసరిస్తుంటారు. అందుకే వారి ముందు ఇతరులను తూలనాడొద్దు. కోపాన్ని నియంత్రించుకోలేక మాటలు వదలొద్దు అంటున్నారు మానసిక నిపుణులు. పసివాళ్లుగా ఉన్నప్పటి నుంచే కుటుంబ సభ్యుల హావభావాలను గుర్తించడం మొదలుపెడతారు.   

Published : 31 Jul 2023 00:13 IST

పిల్లలు ఏం చూస్తే అదే నేర్చుకుంటారు. పెద్దల ప్రవర్తనని అనుసరిస్తుంటారు. అందుకే వారి ముందు ఇతరులను తూలనాడొద్దు. కోపాన్ని నియంత్రించుకోలేక మాటలు వదలొద్దు అంటున్నారు మానసిక నిపుణులు.  

  • పసివాళ్లుగా ఉన్నప్పటి నుంచే కుటుంబ సభ్యుల హావభావాలను గుర్తించడం మొదలుపెడతారు. భాషా ప్రయోగాలను గమనిస్తారు. అందుకే చిన్నప్పటి నుంచే వారితో మర్యాదగా మాట్లాడటం, ఎదుటివారిని గౌరవించేలా ప్రోత్సహించాలి. కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు, మంచిగా తన అభిప్రాయాలు చెబుతున్నప్పుడు అభినందించాలి. ఇవన్నీ వారిలో మంచి నడవడికను అలవరుస్తాయి.
  • కొందరు ప్రతి చిన్న విషయానికీ ‘నువ్వెందుకూ.. పనికిరావు’, ‘నీకే పనీ రాదు’ అంటూ తిడుతుంటారు. ఈ పని వారిలో మార్పు రాకపోగా, మరింత నిర్లక్ష్యంగా మారేందుకు సాయపడుతుంది. ఆత్మన్యూనతకు దారితీస్తుంది. విజేతలుగా నిలబెట్టేది శ్రమ మాత్రమేనని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఓటమి నుంచి బయటపడటం, అవమానాలకు ఎదురొడ్డి నిలబడే స్ఫూర్తిని వారికివ్వాలి.
  • చిన్నారులు ఏదైనా పనిచేయాలనుకుంటే ఆదిలోనే అడ్డుపడొద్దు. ప్రణాళిక, పరిశ్రమ ఉంటే ఏదైనా సాధించగలరన్న నమ్మకాన్ని ఏర్పరచండి. నిర్దుష్టమైన లక్ష్యాలను ఏర్పరుచుకొనేలా చేయూతనివ్వాలి. అప్పుడే చిన్నారులు సంతోషంగా అందమైన బాల్యాన్ని అనుభవిస్తారు. దాన్ని మధురమైన జ్ఞాపకంగా మలుచుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్