Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Aug 2023 09:18 IST

1. డబ్బులివ్వందే బిడ్డనూ చూడనివ్వరు!

‘కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చే వారంతా పేదలే. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. ఆసుపత్రికి రావడానికే ఇబ్బందులు పడుతుంటాం. ఆసుపత్రిలో కూర్చుంటే, దుస్తులు మారిస్తే, వార్డు మారిస్తే, ప్రసవమైతే ఒక్కో దానికి ఒక్కో రేటు నిర్ణయించి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. లేవని మొత్తుకున్నా వినడంలేదు. ఇవ్వకుంటే బూతులు తిడుతున్నారు. వైద్యులు, నర్సులు బాగానే చూస్తున్నా కొంతమంది సిబ్బంది తీరు చాలా బాధాకరంగా ఉంది.’  ఇదీ ఓ బాలింత తల్లి రామలక్షుమ్మ ఆవేదన. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సహర్ష్‌.. ఆలోచన అదుర్స్‌

వ్యవసాయ రుణాలు అందక.. అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోతున్న రైతులకు అండగా నిలిచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు ఆ విద్యార్థి. ఒకవైపు చదువుకుంటూనే.. మరోవైపు ఖాళీ సమయంలో కర్షకుల కోసం ఏదైనా చేయాలని ఆరాటపడుతున్నాడు. ఐక్యరాజ్యసమితి 1ఎం1బి ప్రాజెక్టులో భాగంగా వినూత్న ఆలోచనలకు ఆహ్వానం పలకగా.. అతని ఆలోచన కూడా ఎంపికైంది. ప్రస్తుతం తన ఆలోచనను కార్యరూపంలోకి తీసుకొచ్చే పనిలో ఉన్నాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘హంతకులు బయట తిరుగుతున్నారు.. నా కొడుకు జైల్లో మగ్గుతున్నాడు’

‘హత్యలు చేసినవాళ్లు బయట తిరిగేస్తున్నారు. రోడ్డుమీద చంపేసి మూట కట్టేసి పడేసినోళ్లకు బెయిల్‌ ఇచ్చేశారు. నా కొడుకు ఏ తప్పు చేయపోయినా నాలుగున్నరేళ్లుగా జైల్లో పెట్టారు’ అని కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కేసును విశాఖ ఎన్‌ఐఏ కోర్టుకు బదిలీ చేసిన నేపథ్యంలో ఆమె ‘ఈనాడు’తో మాట్లాడుతూ తన కొడుకును గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘మా అబ్బాయి చాలా మంచోడు.. ఎందుకు అలా జరిగిందంటే మేమేం చెప్పాలి..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పుష్పగిరినీ వదలని మట్టి మాఫియా

వైయస్‌ఆర్‌ జిల్లా వల్లూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పుష్పగిరి కొండను కొంతమంది అక్రమార్కులు తవ్వి, మట్టి తరలిస్తున్నారు. పౌర్ణమి సందర్భంగా మంగళవారం ఉదయం ధర్మపరిరక్షణ సేన సభ్యులు, పెద్దసంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. చెన్నకేశవస్వామి ఆలయం నుంచి దుర్గమ్మ ఆలయం మార్గంలో కాలభైరవస్వామి విగ్రహం దాటాక అక్రమార్కులు పొక్లెయిన్లతో కొండను తవ్వి మట్టి తరలిస్తుండటాన్ని గమనించి ప్రశ్నించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘ఇంజినీరింగ్‌’ కనీస ఫీజు రూ.42,500

ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఫీజుల ఖరారుపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ప్రస్తుతానికి కనీస ఫీజు రూ.42,500గా నిర్ణయించాలని మధ్యేమార్గంగా ప్రతిపాదన చేసింది. ఇప్పటికే అంతకన్నా ఎక్కువ ఫీజులు నిర్ధారించిన కళాశాలల్లో మరో 10శాతం రుసుములు పెంచుకోవడానికి వీలు కల్పిస్తామని సూచన చేసింది. ఈ ప్రతిపాదనపై వైఖరి తెలపాలని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలను ఆదేశించింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఇంటర్‌ సీట్లు నిండకపోతే జీతాలు నిలిపివేస్తాం!

'ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలు 80 శాతంలోపే ఉన్నందున మీ జులై వేతనం నిలిపివేస్తున్నాం’ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలు(టీఎంఆర్‌జేసీ) ప్రిన్సిపాళ్లకు మైనారిటీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఇచ్చిన ఆదేశాలివి. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఎంఆర్‌జేసీ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల్లో కలకలం స్పష్టించింది. జులై 19 నాటికి మొత్తం 81 మైనారిటీ గురుకులాల్లో ఇంటర్‌ సీట్లలో 80 శాతానికంటే తక్కువగానే భర్తీ అయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అదిగదిగో జాబిల్లి

కోట్ల మంది భారతీయుల ఆశలను మోసుకుంటూ నింగిలోకి వెళ్లిన చంద్రయాన్‌-3 వ్యోమనౌక అప్రతిహతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఒక్కో దశను అధిగమిస్తూ చందమామ దిశగా అడుగులు వేస్తోంది. 17 రోజుల పాటు భూమి చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఈ వ్యోమనౌక.. ఇప్పుడు కీలకమైన ‘ట్రాన్స్‌లూనార్‌ ఇంజెక్షన్‌’ (టీఎల్‌ఐ) దశను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఫలితంగా అది భూమికి వీడ్కోలు చెప్పి.. చందమామ దిశగా పయనాన్ని ఆరంభించింది. ఇక జాబిల్లిని చేరుకోవడమే తరవాయి. ఈ నెల 5న అది చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వచ్చే ఏడాది ‘పది’ విద్యార్థులకు తెలుగు తప్పనిసరి

రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరంలో పది విద్యార్థులు తెలుగును బోర్డు పరీక్షగా రాయడం తప్పనిసరని తెలుగు అమలు కమిటీ స్పష్టం చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని రకాల పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులందరూ తెలుగు సబ్జెక్టు పరీక్ష రాయడంపై విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి నేతృత్వంలో తెలుగు అమలు కమిటీ మంగళవారం సమావేశం నిర్వహించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వాయేజర్‌-2 నుంచి అందుతున్న సంకేతాలు!

భూమి నుంచి వందల కోట్ల కిలోమీటర్ల దూరంలో.. సౌర కుటుంబం అవతల పయనిస్తున్న అమెరికా వ్యోమనౌక వాయేజర్‌-2 నుంచి తిరిగి సంకేతాలు రావడం మొదలైంది.  ఈ వ్యోమనౌకను నియంత్రించే అధికారులు రెండు వారాల కిందట పొరపాటున తప్పుడు ఆదేశం ఇచ్చారు. ఫలితంగా వాయేజర్‌-2 యాంటెన్నా.. భూమి దిశగా కాకుండా వేరే వైపునకు మళ్లింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బ్యాంకుల్లో భారీ కొలువులు!

బ్యాంకు పరీక్షార్థులను ఆనందాశ్చర్యాలతో ముంచెత్తుతూ ఐబీపీఎస్‌ ఒకేసారి రెండు నోటిఫికేషన్లు.. (ప్రొబేషనరీ ఆఫీసర్లు, స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు) విడుదల చేసింది. ఐబీపీఎస్‌ పీఓ నోటిఫికేషన్‌ను మాత్రం సాధారణ సమయానికే  విడుదల చేసినా.. స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌ నోటిఫికేషన్‌ను రెండు నెలల ముందే విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పీఓ ఖాళీలు 3049, స్పెషలిస్ట్‌ ఖాళీలు  1402 - అంటే మొత్తం 4451 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని