‘హంతకులు బయట తిరుగుతున్నారు.. నా కొడుకు జైల్లో మగ్గుతున్నాడు’

‘హత్యలు చేసినవాళ్లు బయట తిరిగేస్తున్నారు. రోడ్డుమీద చంపేసి మూట కట్టేసి పడేసినోళ్లకు బెయిల్‌ ఇచ్చేశారు. నా కొడుకు ఏ తప్పు చేయపోయినా నాలుగున్నరేళ్లుగా జైల్లో పెట్టారు’ అని కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తంచేశారు.

Updated : 02 Aug 2023 09:53 IST

కోడికత్తి కేసు నిందితుడి తల్లి సావిత్రి ఆవేదన

ఈనాడు, కాకినాడ: ‘హత్యలు చేసినవాళ్లు బయట తిరిగేస్తున్నారు. రోడ్డుమీద చంపేసి మూట కట్టేసి పడేసినోళ్లకు బెయిల్‌ ఇచ్చేశారు. నా కొడుకు ఏ తప్పు చేయపోయినా నాలుగున్నరేళ్లుగా జైల్లో పెట్టారు’ అని కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కేసును విశాఖ ఎన్‌ఐఏ కోర్టుకు బదిలీ చేసిన నేపథ్యంలో ఆమె ‘ఈనాడు’తో మాట్లాడుతూ తన కొడుకును గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘మా అబ్బాయి చాలా మంచోడు.. ఎందుకు అలా జరిగిందంటే మేమేం చెప్పాలి.. మేం జగన్‌ పార్టీ.. జగన్‌ అంటే మాకు మహాభిమానం. మేము ఆయననే నమ్ముకున్నాం. కానీ తప్పు మా మీదకు ఎందుకు తోశారో మాకేం తెలుసు?’ అని వ్యాఖ్యానించారు. ‘అందరూ మీకు బుద్ధి లేదని అంటున్నా.. మేం ఆయన్నే నమ్మాము. నా కొడుకు బయటకు వస్తాడో రాడో దేవుడి చిత్తం.. నా కొడుకు కర్మ అలా అయిపోయింది’ అని వాపోయారు. ‘ఎన్‌ఐఏ వాళ్లు నా కొడుకుది ఏమీ తప్పులేదని చెప్పారు. మా అబ్బాయి ఇంటికొచ్చేస్తాడనే నమ్ముతున్నా చివరిరోజుల్లో నా కొడుకు మా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. గోదావరి వరదలకు ముమ్మిడివరం మండలం ఠాణేలంకలో మిర్చి, బెండ తోటలు మునిగి నష్టపోయామని ఆవేదన వ్యక్తంచేశారు. తన కొడుకును విడుదల చేయాలని కోరుతూ గతంలో ఆమె రాష్ట్రపతికి లేఖరాశారు. తర్వాత ముఖ్యమంత్రి జగన్‌ను కలవడానికి తాడేపల్లి వెళ్లినా ఫలితం లేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని