వచ్చే ఏడాది ‘పది’ విద్యార్థులకు తెలుగు తప్పనిసరి

రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరంలో పది విద్యార్థులు తెలుగును బోర్డు పరీక్షగా రాయడం తప్పనిసరని తెలుగు అమలు కమిటీ స్పష్టం చేసింది.

Updated : 02 Aug 2023 09:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరంలో పది విద్యార్థులు తెలుగును బోర్డు పరీక్షగా రాయడం తప్పనిసరని తెలుగు అమలు కమిటీ స్పష్టం చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని రకాల పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులందరూ తెలుగు సబ్జెక్టు పరీక్ష రాయడంపై విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి నేతృత్వంలో తెలుగు అమలు కమిటీ మంగళవారం సమావేశం నిర్వహించింది. పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, అధికార భాషా సంఘం ఛైర్మన్‌ మంత్రి శ్రీదేవి, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని