Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Aug 2023 09:18 IST

1. రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాం.. కుట్టకే దోమా!

దోమలకూ బడ్జెట్‌. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ప్రతి ఇంట్లో నెలనెలా పాలు, నీళ్లు, పిల్లల చదువు, వైద్యం, విద్యుత్తు, రేషన్‌ సరకులు... ఇలా ప్రతి దానికీ కొంత కేటాయించుకున్నట్లే దోమల కట్టడికి కొంత మొత్తం పక్కన పెట్టాల్సిన పరిస్థితి. ఒక  ఇంట్లో విద్యుత్తు బిల్లుతో సమానంగా దోమల నివారణకు ఖర్చుపెడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇదిగాక  డెంగీ, మలేరియాతో అనారోగ్యం పాలైతే రూ.వేలు, లక్షల్లో వ్యయం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జైల్లో పెడతామని బెదిరించారు

 ప్రస్తుత వేధింపుల పాలనను అంతం చేసి భావితరాలకు మంచి రాష్ట్రాన్ని ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు పిలుపునిచ్చారు. ఈ నెల 9న తెదేపా అధినేత చంద్రబాబు పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో శనివారం పార్వతీపురంలో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని అన్ని రంగాల అభివృద్ధి కుంటుపడింది. వైకాపా పాలనలో బెదిరింపులు ఎక్కువయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కండ్ల కలకకు స్టెరాయిడ్‌ చుక్కల మందు వద్దు 

దేశ రాజధాని దిల్లీలో కండ్ల కలక తీవ్రంగా వ్యాపిస్తోంది. దీన్ని వైద్య పరిభాషలో కంజెక్టివైటిస్‌, ఐ ఫ్లూ అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధులకు నేత్ర వైద్యుల సిఫార్సు లేకుండా ప్రజలే సొంతగా స్టెరాయిడ్‌ కంటి చుక్కలు వాడితే తాత్కాలికంగా ఉపశమనం కలిగినా దీర్ఘకాలంలో హాని జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంజెక్టివైటిస్‌ ఎలాంటి మందులు లేకుండా దానంతట అదే ఒకటీ రెండు వారాల్లో తగ్గిపోతుందని, ఎడినో వైరస్‌ వల్ల వచ్చిన కండ్ల కలకకు మాత్రమే స్టెరాయిడ్‌ చుక్కలు వాడాలని..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 166 ఏళ్ల తర్వాత మాతృభూమికి.. సిపాయిల తిరుగుబాటు వీరుడి పుర్రె

బ్రిటిష్‌ ఇండియా సైన్యంలో హవల్దారుగా పనిచేసిన భారత వీరుడు ఆలం బేగ్‌ పుర్రె(Skull of Alum Bheg) 166 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గత వారం లండన్‌ నుంచి స్వదేశానికి చేరుకొంది. 1857 నాటి సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న ఆలం బేగ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌ వాసి. ఈయన 46వ బెంగాల్‌ రెజిమెంటులో పదాతిదళ సైనికుడిగా పనిచేసేవారు. ఆంగ్లేయుల ప్రభుత్వంపై తిరుగుబాటులో చురుగ్గా పాల్గొన్న కారణంగా ఆలం బేగ్‌ను దారుణంగా చంపి, పుర్రెను బ్రిటిష్‌ రాణికి కానుకగా లండన్‌కు పంపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వైకాపా అక్రమాలపై.. కనం, వినం, మాట్లాడం!

చెడు చూడం.. చెడు వినం.. చెడు మాట్లాడం అన్న మూడు కోతుల సిద్ధాంతాన్ని వైకాపా నాయకుల విషయంలో ఉమ్మడి అనంత జిల్లా మైనింగ్‌ అధికారులు సంపూర్ణంగా పాటిస్తున్నారు. నాయకులు చేసే అక్రమాలను పరిశీలించే సమయం వారికి ఉండటం లేదు. ఎవరైనా చెప్పినా వినేంత తీరిక లేదు. ఇక అక్రమాలపై వివరణ అడిగితే మాత్రం ఆమడ దూరం పారిపోతారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గేట్‌-2024లో కొత్తగా డేటా సైన్స్‌ అండ్‌ ఏఐ ప్రశ్నపత్రం

ఐఐటీలు తదితర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌-2024)లో ఈసారి కొత్తగా డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఈసారి గేట్‌ను బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) నిర్వహించనుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 9వ తరగతి పుస్తకాల్లో అమూల్‌ ప్రస్తావన

ప్రభుత్వం ముద్రించిన తొమ్మిదో తరగతి పాఠ్య పుస్తకంలోని ఓ అంశం చర్చనీయాంశంగా మారింది. సామాజికశాస్త్రంలోని ప్రజాస్వామ్య రాజకీయాలు-1 పాఠ్య పుస్తకంలో వార్తా పత్రికలు చదవాలని సూచిస్తూ దశాబ్దాల క్రితం నాటి పలు వార్తలకు చెందిన క్లిప్పింగులను వ్యంగ్య చిత్రాలతో సహా ఇచ్చారు. అధ్యాయం-4లోని సంస్థల పనితీరు పాఠంలో రిజర్వేషన్‌పై చర్చ చాలా ముఖ్యమైన విషయం అని, ప్రకటనదారులు తమ ఉత్పత్తులు విక్రయించడానికి ఈ వృత్తాంతాన్ని ఉపయోగించారని వివరిస్తూ ‘అమూల్‌ బటర్‌’ ప్రకటనను ముద్రించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దసరా నుంచి విశాఖలోనే సీఎం జగన్‌?

ముఖ్యమంత్రి జగన్‌ దసరా నాటికి విశాఖపట్నంకు మారనున్నట్లు ఆయన కార్యాలయం నుంచి అనధికారిక సమాచారం బయటకొచ్చింది. ‘సెప్టెంబరు నుంచి విశాఖలోనే కాపురం ఉంటా’ అని ముఖ్యమంత్రి స్వయంగా ఇప్పటికే ప్రకటించారు. తాజాగా దసరాను ముహూర్తంగా నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన పూర్తిగా విశాఖకు మారనున్నారా? వారంలో కొద్దిరోజులు వెళ్లి వస్తారా? అనే విషయంలో స్పష్టత లేదు. మరోవైపు విశాఖలోని రుషికొండ వద్ద నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంపు కార్యాలయం కోసమనే చర్చ కొంతకాలంగా విస్తృతంగా జరుగుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వాగు దాటొస్తేనే.. పాఠం చెప్పేది!

భారీ వర్షాలు కురిసిన సందర్భాల్లో వాగులు దాటితేనే ఆ ఊరి ప్రజలు బాహ్యప్రపంచాన్ని చూసేది. ఈ పరిస్థితుల్లో గ్రామ విద్యార్థుల చదువు పెద్దసమస్యగా మారుతోంది. ఉపాధ్యాయుడు వాగుదాటి వస్తేగానీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బోధన సాగదు. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం సేవాదాస్‌నగర్‌ గ్రామంలో 35 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలోని పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులను ఓ ఇంటి ఆవరణలో కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నిధులొచ్చే మార్గమున్నా.. నీళ్లిచ్చే మనసు లేదు

మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుసు. ఏటా వేసవి వచ్చిందంటే మైళ్ల దూరం నడిచి వెళ్లి, నీళ్లు తెచ్చుకుంటున్న జనం కష్టాలను చూస్తున్నాం. పొలాలు, వాగులు, చెరువుల్లోని కలుషిత నీటితో గొంతు తడుపుకుంటున్న వైనాన్నీ వింటున్నాం. కలుషిత నీరు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న గ్రామీణుల అవస్థలు మనసున్న ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నా... సీఎం జగన్‌ను మాత్రం కదిలించలేకపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని