వాగు దాటొస్తేనే.. పాఠం చెప్పేది!

భారీ వర్షాలు కురిసిన సందర్భాల్లో వాగులు దాటితేనే ఆ ఊరి ప్రజలు బాహ్యప్రపంచాన్ని చూసేది. ఈ పరిస్థితుల్లో గ్రామ విద్యార్థుల చదువు పెద్దసమస్యగా మారుతోంది.

Published : 06 Aug 2023 07:03 IST

భారీ వర్షాలు కురిసిన సందర్భాల్లో వాగులు దాటితేనే ఆ ఊరి ప్రజలు బాహ్యప్రపంచాన్ని చూసేది. ఈ పరిస్థితుల్లో గ్రామ విద్యార్థుల చదువు పెద్దసమస్యగా మారుతోంది. ఉపాధ్యాయుడు వాగుదాటి వస్తేగానీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బోధన సాగదు. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం సేవాదాస్‌నగర్‌ గ్రామంలో 35 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలోని పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులను ఓ ఇంటి ఆవరణలో కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. గ్రామంలోని 13 మంది పాఠశాల విద్యార్థులు, 10 మంది అంగన్‌వాడీ విద్యార్థులకు అక్కడే బోధిస్తున్నారు. అయితే, గ్రామశివారులోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తే ఉపాధ్యాయుడు రాక బోధన సాగడంలేదు. గ్రామ సమీపంలోని వాగుపై వంతెన నిర్మించి విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఈనాడు, ఆదిలాబాద్‌, న్యూస్‌టుడే, నేరడిగొండ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని