Amul: 9వ తరగతి పుస్తకాల్లో అమూల్‌ ప్రస్తావన

ప్రభుత్వం ముద్రించిన తొమ్మిదో తరగతి పాఠ్య పుస్తకంలోని ఓ అంశం చర్చనీయాంశంగా మారింది. సామాజికశాస్త్రంలోని ప్రజాస్వామ్య రాజకీయాలు-1 పాఠ్య పుస్తకంలో వార్తా పత్రికలు చదవాలని సూచిస్తూ దశాబ్దాల క్రితం నాటి పలు వార్తలకు చెందిన క్లిప్పింగులను వ్యంగ్య చిత్రాలతో సహా ఇచ్చారు.

Updated : 06 Aug 2023 19:25 IST

తుని, న్యూస్‌టుడే: ప్రభుత్వం ముద్రించిన తొమ్మిదో తరగతి పాఠ్య పుస్తకంలోని ఓ అంశం చర్చనీయాంశంగా మారింది. సామాజికశాస్త్రంలోని ప్రజాస్వామ్య రాజకీయాలు-1 పాఠ్య పుస్తకంలో వార్తా పత్రికలు చదవాలని సూచిస్తూ దశాబ్దాల క్రితం నాటి పలు వార్తలకు చెందిన క్లిప్పింగులను వ్యంగ్య చిత్రాలతో సహా ఇచ్చారు. అధ్యాయం-4లోని సంస్థల పనితీరు పాఠంలో రిజర్వేషన్‌పై చర్చ చాలా ముఖ్యమైన విషయం అని, ప్రకటనదారులు తమ ఉత్పత్తులు విక్రయించడానికి ఈ వృత్తాంతాన్ని ఉపయోగించారని వివరిస్తూ ‘అమూల్‌ బటర్‌’ ప్రకటనను ముద్రించారు. దీనిలో ‘నా చేతిలోని బటర్‌కు రిజర్వేషన్‌ లేదు. అమూల్‌ ఒక అల్లరి రుచి’ అని ఆ సంస్థ పేర్కొన్నట్లు ఉంది. ఇలా ఓ ప్రైవేటు సంస్థకు ఊతమిచ్చేలా ప్రకటనను విద్యార్థుల పాఠ్యపుస్తకంలో ముద్రించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖ ఇలా స్వామి భక్తి చాటుకుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సహకార డెయిరీలను పట్టించుకోకుండా, మరో రాష్ట్రానికి చెందిన అమూల్‌పై ఎనలేని ప్రేమ చూపిస్తూ ప్రోత్సహిస్తుండటం ఇప్పటికే పలు విమర్శలకు తావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని