దసరా నుంచి విశాఖలోనే సీఎం జగన్‌?

ముఖ్యమంత్రి జగన్‌ దసరా నాటికి విశాఖపట్నంకు మారనున్నట్లు ఆయన కార్యాలయం నుంచి అనధికారిక సమాచారం బయటకొచ్చింది.

Published : 06 Aug 2023 05:24 IST

రుషికొండను సీఎం భద్రతా సిబ్బంది పరిశీలించారని ప్రచారం

ఈనాడు - అమరావతి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్‌ దసరా నాటికి విశాఖపట్నంకు మారనున్నట్లు ఆయన కార్యాలయం నుంచి అనధికారిక సమాచారం బయటకొచ్చింది. ‘సెప్టెంబరు నుంచి విశాఖలోనే కాపురం ఉంటా’ అని ముఖ్యమంత్రి స్వయంగా ఇప్పటికే ప్రకటించారు. తాజాగా దసరాను ముహూర్తంగా నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన పూర్తిగా విశాఖకు మారనున్నారా? వారంలో కొద్దిరోజులు వెళ్లి వస్తారా? అనే విషయంలో స్పష్టత లేదు. మరోవైపు విశాఖలోని రుషికొండ వద్ద నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంపు కార్యాలయం కోసమనే చర్చ కొంతకాలంగా విస్తృతంగా జరుగుతోంది. ఆ భవనాలను ముఖ్యమంత్రి వ్యక్తిగత భద్రతా బృందం శనివారం పరిశీలించిందని విశాఖలో ప్రచారం జరిగింది. మధ్యాహ్నం 11 గంటల సమయంలో కొందరు వచ్చారని ఆ సమయంలో బయటవారినెవరినీ అటువైపు వెళ్లనీయలేదు. ‘విషయం తెలియడంతో కొండ వద్దకు వెళ్లగా అక్కడకి సీఎం భద్రతా సిబ్బంది ఎవరూ రాలేదని తెలిసింది. ప్రస్తుతం కొండ మీద ఒక బ్లాకుకు చెందిన పనులు చివరి దశలో ఉన్నాయి. వాటికి సంబంధించి ఇంటీరియర్‌ డిజైనర్‌ నిపుణులు వచ్చారని అంటున్నారు. దీనిపై విశాఖ పోలీసులకు ఎటువంటి సమాచారం లేదు’ అని ఒక విశాఖ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని