Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... 

Updated : 09 Aug 2023 09:18 IST

1. 5 కి.మీ వరకు పోలీసు ఆంక్షలు.. జగన్‌ వచ్చింది పరామర్శకేనా?

 ముఖ్యమంత్రి జగన్‌ వస్తున్నారని, తమపై వరాలు జల్లు కురిపిస్తారని ఆశించిన అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా లంకవాసులకు నిరాశే మిగిలింది. ఇళ్లు నానిపోయి, భూములు కోతకు గురై, పంటలు కోల్పోయి.. తీవ్ర వేదనలో ఉన్న వారికి కనీసం తమ కష్టాలు చెప్పే అవకాశమూ దక్కలేదు. మంగళవారం నాటి సీఎం పర్యటన అంతా వైకాపా నేతల భజనతోనే సరిపోయింది. ‘గోదావరి వరదల్లో అన్ని విధాలా మాకు సాయం చేసి.. మా కష్టాలు తెలుసుకోవడానికి వస్తున్న ముఖ్యమంత్రికి స్వాగతం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సీఎస్‌ఈ వస్తేనే చేరతాం!

దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్రీయ విద్యా సంస్థల్లో సీటొస్తే చాలు జీవితంలో స్థిరపడినట్లేనని విద్యార్థులు భావించేవారు. ప్రస్తుత సీట్ల భర్తీ తీరును చూస్తుంటే అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి ప్రతిష్ఠాత్మక సంస్థల్లోనూ ఏకంగా 29.37% బీటెక్‌ సీట్లు మిగిలిపోవడమే ఇందుకు కారణం. ఆయా సంస్థల్లో మొత్తం 39,767 సీట్లుండగా ప్రస్తుతం 11,284 సీట్లు ఖాళీగా ఉన్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆర్టీసీ ఉద్యోగుల వయోపరిమితి 61 !

ఆర్టీసీ ఉద్యోగుల వయో పరిమితి 61 సంవత్సరాలకు పెరిగే అవకాశం ఉంది. సంస్థలో ప్రస్తుతం రిటైర్‌మెంట్‌ వయసు 60గా ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం బిల్లును శాసనసభ, మండలి ఆమోదించిన విషయం తెలిసిందే. గవర్నర్‌ ఆమోదంతో చట్టరూపం దాల్చనుంది.
అనంతరం వారంతా ప్రభుత్వ ఉద్యోగులవుతారు. ఈక్రమంలో వారి పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెరగనుంది. దీంతో సంస్థకు ఆర్థికంగా కొంత ప్రయోజనం కలగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బడికి వెళ్లాలంటే.. కొండలు ఎక్కాల్సిందే

ఉత్తరాఖండ్‌లో భారీవర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి రోడ్లు దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చమోలీ జిల్లాలోని గోపేశ్వర్‌ గ్రామ విద్యార్థులు బడికి వెళ్లేందుకు ఏకంగా కొండలనే ఎక్కాల్సి వస్తోంది. ఈ ఊరి చుట్టూ ఉన్న దాదాపు 30కు పైగా రోడ్లు మూసుకుపోయాయి. దీంతో కొండలు ఎక్కేందుకు చిన్నారులు..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వీడియో కాల్స్‌ కోసం వాట్సప్‌ కొత్త ఫీచర్లు

వీడియో కాల్స్‌ కోసం స్క్రీన్‌ షేరింగ్‌, ల్యాండ్‌స్కేప్‌ మోడ్‌ ఫీచర్లను తీసుకొచ్చినట్లు మెటాకు చెందిన మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ వెల్లడించింది. ఇకపై వాట్సాప్‌ వీడియోకాల్‌ సమయంలో స్క్రీన్‌ను షేర్‌ చేసుకునే సౌలభ్యాన్ని తెచ్చినట్లు మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో తెలిపారు. వీడియోకాల్‌ సమయంలో ‘షేర్‌’ ఐకాన్‌పై క్లిక్‌ చేయడం ద్వారా ఈ ఫీచర్‌ను పొందొచ్చు. అదేవిధంగా ల్యాండ్‌స్కేప్‌ మోడ్‌లో వెడల్పుగా చిత్రాన్ని తిలకించొచ్చని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 50 ప్లాట్లు.. రూ.33.06 కోట్లు

మొన్న కోకాపేట.. నిన్న మోకిల.. నేడు షాబాద్‌.. ఎక్కడ హెచ్‌ఎండీఏ ప్లాట్లు అమ్మకానికి పెట్టినా సరే.. కొనుగోలుదారుల నుంచి భారీ స్పందన వస్తోంది. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని లేఅవుట్‌లో 50 ప్లాట్ల కోసం హెచ్‌ఎండీఏ నిర్వహించిన ఈ-వేలంలో పోటాపోటీగా పాల్గొన్నారు. మొత్తం 100 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ ఈ లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తోంది. తొలి విడతలో 50 ప్లాట్లను(15,000 చదరపు గజాలు) మంగళవారం ఈ-వేలం వేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. గృహలక్ష్మిపై.. లక్ష సందేహాలు

పేద, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నెరవేర్చేలా ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. మంగళవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 10 తుదిగడువు విధించడంతో అందరిలో అయోమయం నెలకొంది. దరఖాస్తుకు ఏ పత్రాలు జతచేయాలో.. ఎవరి పేరిట దరఖాస్తు చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తొలిరోజున 3,379 మంది దరఖాస్తులు సమర్పించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. టోల్‌ బాదుడు

జాతీయ రహదారి - 216పైకి రావాలంటేనే కార్ల యజమానులు, ట్యాక్సీ డ్రైవర్లు, ఆర్టీసీ ప్రయాణికులు హడలిపోతున్నారు. టోల్‌ ప్లాజాలు వాహనదారుల తోలు తీస్తున్నాయి. ఒక కిలోమీటరు పరిధిలో రెండు టోల్‌ప్లాజాలు వాహనదారుల ముక్కుపిండి పన్ను వసూలు చేస్తుండడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మోపిదేవి వార్పు గురుకులం వద్ద ఏర్పాటు చేసిన టోల్‌ప్లాజా ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆర్జీయూకేటీ.. ఏమిటీ దుస్థితి!

అక్కడంతా రహస్యమే.. అధ్యాపకుల బోధన, అధికారుల పర్యవేక్షణ, విద్యార్థుల బాగోగులు-మానసిక స్థితిగతులు- బోధకుల కౌన్సెలింగ్‌.. సైతం గోప్యమే. వెరసి.. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) అంటేనే అంతుచిక్కని ఓ రహస్య కేంద్రంగా మారుతోంది. గ్రామీణ విద్యార్థులను సాంకేతిక రంగంలో వైజ్ఞానికులను తయారుచేస్తూ భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన చోటే బలవన్మరణాలు చోటుచేసుకోవడం కలకలం రేకెత్తిస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇవి తాగేనీళ్లా..?

‘వర్షాకాలం.. వ్యాధుల ముప్పు పొంచి ఉండేసమయం.. స్వచ్ఛమైన తాగునీటిని వినియోగించండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి’ ఇదీ మన వైద్యఆరోగ్యశాఖ చేస్తున్న ప్రచారం.. కానీ తాగునీటి సరఫరా యంత్రాంగానికి మాత్రం అవేం పట్టలేదు. ఇందుకు ఉదాహరణ టెక్కలి మండల దాహార్తి తీర్చే నీటి పథకం నిర్వహణ తీరే.. ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత నీటి పథకం నుంచి కొద్దిరోజులుగా సరఫరా చేస్తున్న నీటిని చూస్తే అసలు దీన్ని ఎలా తాగగలం అన్న సందేహం కలుగుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని