Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 12 Aug 2023 10:07 IST

1. మెగాస్టార్‌ గుండెలపై గన్‌ పెట్టా!

మన్యంలోని మారుమూల కుగ్రామంలో పుట్టి వెండితెరపై కనిపించడం అంత సులభం కాదు. అయితే ఆ ఆదివాసీ గిరిజన యువకుడు పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకున్నాడు. చిత్రసీమలోకి అడుగుపెట్టడమే కాకుండా అందులో రాణిస్తూ మరింత మందికి స్ఫూర్తినిస్తున్నాడు. తన ప్రతిభ, దేహదారుఢ్యంతో మేకర్స్‌ని మెప్పించి మెగాస్టార్‌ చిరంజీవితో కలసి నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. అతడే అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గెమ్మెలి మధుకర్‌రాజ్‌ అలియాస్‌ మేడీ. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆశలన్నీ రివర్స్‌

గూడు లేని పట్టణ పేదలకు టిడ్కో ద్వారా నిర్మించి ఇవ్వాల్సిన ఇళ్లు ఇప్పట్లో అందేలా లేవు. నాలుగేళ్లుగా ఇవిగో అవిగో అంటూ కాలయాపన చేయడం తప్ప.. నిర్మాణాలు నిర్దిష్టంగా ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదు. దీంతో లబ్ధిదారులు అద్దె ఇళ్లల్లో ఉంటూ అవస్థలు పడుతూనే ఉన్నారు. అదే సమయంలో మరికొందరు నగదు చెల్లించినప్పటికీ అటు ఇళ్లు మంజూరవ్వక.. కట్టినవి తిరిగిరాక ఆందోళన చెందుతున్నారు. కొందరైతే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో ఏకంగా ప్రజాప్రతినిధులనే నిలదీస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ట్రిపుల్‌ ఐటీ విద్యకు ఏమైంది?

పేదలకు సాంకేతిక విద్య అందించాలన్న ఆశయంతో ట్రిపుల్‌ ఐటీలను ప్రారంభించారు. ప్రస్తుతం ఆ సంకల్పం మసకబారుతోంది. ప్రవేశాల్లో మితిమీరిన జాప్యంతో అర్హత ఉన్న విద్యార్థులు ప్రైవేటు కళాశాలల్లో చేరుతున్నారు. దీంతో మొదటి కౌన్సెలింగ్‌లో 771 సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రంలో నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ, శ్రీకాకుళంలో ట్రిపుల్‌ ఐటీలున్నాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. త్వరలో ఓఆర్‌ఆర్‌పై సైకిల్‌ సవారీ

అవుటర్‌ రింగ్‌రోడ్డుపై త్వరలో సైకిల్‌ సవారీ ప్రారంభం కానుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అవుటర్‌ చుట్టూ 23 కిలోమీటర్ల పరిధిలో సైకిల్‌ ట్రాక్‌ పనులు జరగుతున్నాయి. ఇందుకు హెచ్‌ఎండీఏ రూ.90 కోట్లు వెచ్చిస్తోంది. ప్రస్తుతం తుది మెరుగుల్లో ఉందని పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విసుగు చెందేలా.. వింత శబ్దాలు

నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఏదో ఒక వింత శబ్దంతో చిరాకు తప్పడం లేదు. మైకుల మోత, రాజయ నాయకుల ఊరేగింపులు, కూరగాయల నుంచి పాతసామాన్లు కొనేవారు, ఐస్‌క్రీమ్‌ బండ్లవారు, మున్సిపల్‌ చెత్తసేకరణ కోసం వాడే మైకులు, డీజే శబ్దాలతో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇక కొందరు ఆకతాయిలు తమ వాహనం సైలెన్సర్‌, హారన్‌ మార్చి రయ్‌ మంటూ దూసుకెళ్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కాంగ్రెస్‌లో ముదిరిన వర్గపోరు

 అసెంబ్లీ సమరానికి సమయం ఆసన్నమవుతున్న వేళ ఆసిఫాబాద్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు క్రమంగా తారస్థాయికి చేరింది. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు మద్దతు తెలుపుతున్న రాఠోడ్‌ గణేష్‌, జిల్లా పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌ మద్దతు తెలుపుతున్న మర్సుకోల సరస్వతి.. ఇద్దరూ కాంగ్రెస్‌ పార్టీ నుంచి  అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల నేతలు ఎవరికి వారే క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకోవడానికి కృషి చేస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సీఎం నోట.. మళ్లీ అదే మాట!

గోదావరి ఉగ్రరూపం దాల్చిన ప్రతిసారీ కళ్లెదుటే భూములు, అందులోని విలువైన పంటలు నదీ గర్భంలో కలిసిపోతుంటే.. నిస్సహాయంగా చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఆ ప్రాంత రైతులది. కోత నివారణ చర్యలపై సర్కారు కాలక్షేపం చేస్తోందని.. మూడున్నరేళ్ల క్రితం ఇచ్చిన హామీకే దిక్కులేదు.. ఇప్పుడు కొత్త హామీని రెండు నెలల్లో ఎలా నిలబెట్టుకుంటారో చూద్దామనే చర్చ కోనసీమ ప్రాంతంలో నడుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఇస్లాం బ్యాంకు గుర్తుందా?

కర్ణుడికి కవచ కుండలాల వలే ‘విలువలు, విశ్వసనీయత’ అనేవి జన్మత: తనకు వచ్చినట్టు జగన్‌ వీర పలుకులు వల్లె వేస్తుంటారు. ఆయన వందిమాగధులైతే... జగన్‌ ‘చెప్పాడంటే.. చేస్తాడంతే’ అని ఆర్భాట ప్రచారమూ చేస్తారు. వాస్తవమేమిటో ఈ నాలుగేళ్లలో రాష్ట్ర ప్రజలందరికీ అనుభవంలోకొచ్చింది. మాట తప్పను.. మడమ తిప్పనంటూనే జగన్‌ చాకచక్యంగా నాలుక మడతేస్తారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఉద్యోగాలిచ్చే చదువులే కావాలి

భావిజీవితానికి స్థిరత్వాన్ని ప్రసాదించేలా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మార్గం చూపే చదువులను నేటి యువత ప్రగాఢంగా కోరుకుంటోందని ఓ సర్వే వెల్లడించింది. స్వతంత్ర జీవనానికి, ఆర్థిక, సామాజిక భద్రతకు భరోసానిచ్చేలా విద్యాభ్యాసం కొనసాగాలన్నది తమ అభిలాషగా 10 నుంచి 24 ఏళ్ల వయసున్న గ్రూపులోని 40.5శాతం మంది తెలిపారు. ‘యువత ఏం కోరుకుంటోంది’ అనే పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అనుబంధ పీఎంఎన్‌సీహెచ్‌ ప్రపంచవ్యాప్త రియల్‌టైమ్‌ సర్వేను నిర్వహిస్తోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కాంగ్రెస్‌లో వైతెపా విలీనంపై కొలిక్కి రాని షర్మిల ప్రయత్నాలు

కాంగ్రెస్‌లో వెఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) విలీనానికి ఆ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కిరాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. వైతెపాను కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు షర్మిల కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అధిష్ఠానంలోని ముఖ్యులతో ఆమె, భర్త అనిల్‌ కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నారు. గత రెండు రోజుల్లోనూ ఇదే పనిపై షర్మిల దిల్లీలో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని