logo

త్వరలో ఓఆర్‌ఆర్‌పై సైకిల్‌ సవారీ

అవుటర్‌ రింగ్‌రోడ్డుపై త్వరలో సైకిల్‌ సవారీ ప్రారంభం కానుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అవుటర్‌ చుట్టూ 23 కిలోమీటర్ల పరిధిలో సైకిల్‌ ట్రాక్‌ పనులు జరగుతున్నాయి.

Updated : 12 Aug 2023 05:10 IST

23 కి.మీ. మేర ట్రాక్‌ సిద్ధం

సోలార్‌ రూఫ్‌ సైక్లింగ్‌ ట్రాక్‌

ఈనాడు, హైదరాబాద్‌: అవుటర్‌ రింగ్‌రోడ్డుపై త్వరలో సైకిల్‌ సవారీ ప్రారంభం కానుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అవుటర్‌ చుట్టూ 23 కిలోమీటర్ల పరిధిలో సైకిల్‌ ట్రాక్‌ పనులు జరగుతున్నాయి. ఇందుకు హెచ్‌ఎండీఏ రూ.90 కోట్లు వెచ్చిస్తోంది. ప్రస్తుతం తుది మెరుగుల్లో ఉందని పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం హెచ్‌ఎండీఏ సీఈ బీఎల్‌ఎన్‌రెడ్డి అధికారులతో కలిసి పనులను పరిశీలించి వివరాలను ట్విట్టర్‌లో పెట్టారు. రంగులు వేయడం, క్రాసింగ్‌ల వద్ద భద్రతా సంకేతాల పనులు 2 వారాల్లో పూర్తి కానున్నట్లు తెలిపారు. రాత్రి వేళ కూడా సైక్లింగ్‌ చేసేలా విద్యుద్దీపాలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. తొలివిడతలో నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్‌ అకాడమీ వరకు 8.5 కి.మీ., నార్సింగి నుంచి కొల్లూరు వరకు 14.5 కి.మీ. పొడవునా ఈ ట్రాక్‌ నిర్మిస్తున్నారు. సౌర పలకలతో పైకప్పు ఏర్పాటు చేస్తున్నారు. 16 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తారు. ట్రాక్‌ చుట్టూ లైటింగ్‌, అవుటర్‌పై ఇతర అవసరాలకు వాడుకోగా మిగిలిన విద్యుత్తును గ్రిడ్‌కు అందిస్తారు. సెప్టెంబరు మొదటివారంలో మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా అందుబాటులోకి తేనున్నట్లు ఓ అధికారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని