Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 18 Aug 2023 09:18 IST

1. నేతలా.. మేతలా..!

ఆయన ఓ మంత్రి.. తన పలుకుబడితో కొండపావులూరులో 5 హెక్టార్లు గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతి పొందారు. గనుల శాఖ నిబంధనల మేరకు ముందుగా దరఖాస్తు చేసిన వారికి అనుమతివ్వాలి. కానీ వాటిని పక్కన పెట్టి మంత్రి బినామీకి మంజూరు చేశారు. దీన్ని అడ్డం పెట్టుకుని దాదాపు 20 ఎకరాల్లో గ్రావెల్‌ తవ్వకాలకు రంగం సిద్ధం చేశారు. మంత్రి కావడంతో ఆయన మాటకు అడ్డులేకుండా పోయింది. బినామీతో అనుమతులు పొందినా.. పర్యవేక్షణ మొత్తం సమీప బంధువు చూస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తిరుమల నడక దారిలో తగ్గిన భక్తులు

తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తుల సంఖ్య తగ్గింది. చిన్నారులపై చిరుతల దాడుల కారణంగా 15 ఏళ్ల లోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలోకి అనుమతించడం లేదు. దీంతో చాలా మంది పిల్లలతో బస్సుల్లో వెళ్తున్నారు. నడక మార్గంలో ప్రతి రోజు 12 వేల నుంచి 24 వేల వరకు వెళ్లేవారు. బుధవారం అలిపిరి మార్గంలో 8,200 మంది మాత్రమే తిరుమలకు వెళ్లారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘వడ్లు చల్లితే మా వీధుల్లో మొలకెత్తుతాయి’

 ‘సారూ.. జగన్‌ మళ్లీ గెలిస్తే..మా ఊరి రోడ్డు మారుతుందా లేకుంటే ఇలాగే ఉంటుందా?  వడ్లు చల్లితే మా వీధుల్లో మొలకెత్తుతాయి.  ఇళ్ల ముందుండే బురద గుంతల్లో రాళ్లు వేసుకొని నడుస్తున్నాం. వేసవి కాలంలో ఇలా ఉంటే వానాకాలంలో మా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి... చీకటిపడితే ఇంటి నుంచి బయటకు రాలేం. అంగటికెళ్లి ఏ వస్తువూ తెచ్చుకోలేం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆశ.. దోశ.. క్రమబద్ధీకరణ!

అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇవ్వడంతో వారంతా ఆశపడ్డారు. ఆ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, ప్రాజెక్టులు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ శాఖలని విడివిడిగా చెప్పలేదు. ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న వారినే క్రమబద్ధీకరిస్తామంటూ జగన్‌ మాట మార్చి, మడమ తిప్పేశారు. ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అనేక నిబంధనలు పెడుతూ..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కొత్తగా 1.5 లక్షల ఏఐ ఆధారిత ఉద్యోగాలు

రాష్ట్రంలో 2025 నాటికి కొత్తగా 1.5 లక్షల కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఉద్యోగాలు వచ్చే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భవిష్యత్తు టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాల సంఖ్య పెరిగే అవకాశముందని, ఆ మేరకు మానవ వనరుల్ని సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. విద్యార్థులకు ఏఐ, డీప్‌ లెర్నింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌(ఎంఎల్‌) తదితర రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టామని, లక్ష మంది విద్యార్థులకు ఏఐ నైపుణ్యాలను ఇచ్చే లక్ష్యం పెట్టుకున్నట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TDP-YSRCP: గన్నవరంలో గరం గరం!

6. రైళ్లకు ప్రమాద సంకేతం

నిర్దిష్ట మార్గంలో రైలు పట్టాలు ఖాళీగా ఉన్నాయా, రైళ్లేమైనా ఆ సమయంలో వెళ్తున్నాయా అనేది చెప్పడానికి ఉపయోగపడే సెన్సర్‌ యంత్రాల్లో లోపాలున్నట్లు బయటపడింది. పనితీరు సరిగా లేని వీటిని ఉపసంహరించుకోకుండా వాడడం కొనసాగిస్తే ఒడిశాలోని బాలేశ్వర్‌లో ఇటీవల జరిగిన తరహా ఘోర ప్రమాదాలకు దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఇటలీలో పట్టణాన్ని ముంచెత్తిన బురద.. పరుగులు తీసిన జనం

ఇటలీలో ఆకస్మికంగా సంభవించిన వరదలు ఊహించని నష్టాన్ని మిగిల్చాయి. స్థానికంగా ఓ పట్టణంలో ఎటు చూసినా బురద మేటలే దర్శనమిచ్చాయి. భారీ వర్షాల కారణంగా మెర్డోవిన్‌ నది ఉప్పొంగి ప్రవహించింది. దీనికి తోడు సమీప పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. తీరప్రాంత పట్టణమైన బార్డోనెషియాలో ఒక్కసారిగా మెరుపు వరద ప్రవేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జోరందుకోనున్న ఫిరాయింపులు

ఎన్నికలు దగ్గరపడే కొద్దీ పార్టీ ఫిరాయింపులు జోరందుకుంటున్నాయి. ఉన్న పార్టీలో టికెట్‌ వచ్చే అవకాశం లేకపోతే ఇంకో పార్టీలో చేరి పొందే ప్రయత్నం కొందరు చేస్తుంటే, గట్టిగా టికెట్‌ కోసం ప్రయత్నిస్తే ఏదో ఒక పదవి రాకపోతుందా అనుకొంటున్న వారు కొందరు. ఇలా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మీ ద్విచక్ర వాహనానికి బీమా ఉందా?

మోటారు వాహనాల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ప్రమాదాలూ అధికంగానే నమోదవుతున్నాయి. ఈ సందర్భాల్లో బండి దెబ్బతినడం, వాహనదారుడికి గాయాలు కావడం, కొన్ని సందర్భాల్లో మరణాలూ సంభవిస్తుంటాయి. ప్రయాణంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. దీంతోపాటు అనుకోని ప్రమాదంలో ఆర్థిక భారం లేకుండా ఉండేందుకు మోటార్‌ వాహన బీమా ఉండాలి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కాలయాపనే చైనా వ్యూహమా?

కీలకమైన బ్రిక్స్‌, జీ-20 శిఖరాగ్ర సదస్సులు త్వరలోనే జరగనున్నాయి. ఈ తరుణంలో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడంపై ఇండియా, చైనా దృష్టి సారించాయి. తూర్పు లద్దాఖ్‌లో ఇంకా ఘర్షణాత్మకంగా మిగిలి ఉన్న కొన్ని ప్రాంతాల నుంచి బలగాలను త్వరితగతిన ఉపసంహరించుకోవడంపై తాజాగా విస్తృత స్థాయిలో సమాలోచనలు జరిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని