‘వడ్లు చల్లితే మా వీధుల్లో మొలకెత్తుతాయి’

‘సారూ.. జగన్‌ మళ్లీ గెలిస్తే..మా ఊరి రోడ్డు మారుతుందా లేకుంటే ఇలాగే ఉంటుందా?  వడ్లు చల్లితే మా వీధుల్లో మొలకెత్తుతాయి.  

Published : 18 Aug 2023 05:50 IST

ఎమ్మెల్యేని నిలదీసిన మహిళలు

చేజర్ల, న్యూస్‌టుడే: ‘సారూ.. జగన్‌ మళ్లీ గెలిస్తే..మా ఊరి రోడ్డు మారుతుందా లేకుంటే ఇలాగే ఉంటుందా?  వడ్లు చల్లితే మా వీధుల్లో మొలకెత్తుతాయి.  ఇళ్ల ముందుండే బురద గుంతల్లో రాళ్లు వేసుకొని నడుస్తున్నాం. వేసవి కాలంలో ఇలా ఉంటే వానాకాలంలో మా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి... చీకటిపడితే ఇంటి నుంచి బయటకు రాలేం. అంగటికెళ్లి ఏ వస్తువూ తెచ్చుకోలేం. ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు’ అని స్థానిక మహిళలు తమ సమస్యలను ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డికి ఏకరవు పెట్టారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నూతకివారి కండ్రికలో గురువారం ‘గడప గడపకు’ కార్యక్రమంలో భాగంగా శాసససభ్యుడు విక్రమ్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సమస్యలపై స్థానికులు గళమెత్తారు. కాలనీ పరిస్థితిపై స్థానిక నాయకులు ఇప్పటికే తనకు చెప్పారని త్వరలో సిమెంట్‌ రోడ్లు వేయించి మురుగు సమస్య లేకుండా చూస్తానని మహిళలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో సమస్యలపై ఎంపీపీ విజయభాస్కర్‌రెడ్డి, మండల అధికారులు, స్థానిక నాయకులతో చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని