తిరుమల నడక దారిలో తగ్గిన భక్తులు

తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తుల సంఖ్య తగ్గింది. చిన్నారులపై చిరుతల దాడుల కారణంగా 15 ఏళ్ల లోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలోకి అనుమతించడం లేదు.

Published : 18 Aug 2023 06:39 IST

ఈనాడు, తిరుపతి: తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తుల సంఖ్య తగ్గింది. చిన్నారులపై చిరుతల దాడుల కారణంగా 15 ఏళ్ల లోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలోకి అనుమతించడం లేదు. దీంతో చాలా మంది పిల్లలతో బస్సుల్లో వెళ్తున్నారు. నడక మార్గంలో ప్రతి రోజు 12 వేల నుంచి 24 వేల వరకు వెళ్లేవారు. బుధవారం అలిపిరి మార్గంలో 8,200 మంది మాత్రమే తిరుమలకు వెళ్లారు. గురువారమూ ఇదే పరిస్థితి కనిపించింది. నడక మార్గంలో సెక్యూరిటీ సిబ్బంది కర్రలు పట్టుకొని కనిపించారు.            

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని