Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 Sep 2023 09:16 IST

1. తెలుగులో పీజీ.. తక్కువ ఫీజు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో దూరవిద్యకు దగ్గరి దారి.. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం. అభ్యసన కేంద్రాలు అందుబాటులో ఉండటం, ఎక్కువ సంఖ్యలో కోర్సులు, తక్కువ ఫీజులు, తెలుగు మీడియంలోనూ పీజీ కోర్సులు అందించడం.. తదితర కారణాలతో ఈ సంస్థలో ఎక్కువమంది విద్యార్థులు, ఔత్సాహికులు చేరుతున్నారు. యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను బీఆర్‌ఏఓయూ అందిస్తోంది. వాటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఆ వివరాలు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 11వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు

విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు-విశాఖపట్నం (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం-మచిలీపట్నం (17220) రైలును సెప్టెంబరు 5 నుంచి 10వ తేదీ వరకు, విశాఖపట్నం-గుంటూరు (17240) రైలును 6 నుంచి 11 వరకు, విశాఖపట్నం-విజయవాడ (22701), విజయవాడ-విశాఖపట్నం (22702) ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ను 5, 6, 8, 9 తేదీల్లో రద్దుచేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నాడు భారీ మొత్తాలు కట్టారు.. నేడు రెన్యువల్‌ చేసుకోనేలేదు!

రాష్ట్రంలో గతేడాది రూ. కోట్లు పెట్టి బార్లు దక్కించుకున్న మద్యం వ్యాపారులు.. ఈ ఏడాది వాటి రెన్యువల్‌ కోసం లైసెన్సు ఫీజులు చెల్లించలేదు. ఆ బార్‌ల లైసెన్సులు వదిలేసుకున్నారు. రాష్ట్రంలో సాధారణ బార్లు 840, స్టార్‌ హోటళ్లలో బార్లు 42, మైక్రో బ్రూవరీలు 8 ఉన్నాయి. వీటికి లైసెన్సుల జారీ కోసం గతేడాది ప్రభుత్వం వేలం నిర్వహించగా నిర్ణీత లైసెన్సు రుసుముకు అనేక రెట్లు అధికంగా చెల్లించేలా వేలం పాడి ఆ బార్లు దక్కించుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గిరిజనుల ఇళ్లు కొట్టి.. గ్రానైట్‌ కొల్లగొట్టి..

నిరుపేద ఎస్టీలు ఉంటున్న స్థలంలో ఖనిజ సంపద ఉందని తెలుసుకున్న అధికార పార్టీ నేతలు ఆ కాలనీపై కన్నేశారు. వారిని నమ్మించి మూడేళ్ల క్రితం ఖాళీ చేయించారు. అక్కడ గ్రానైట్‌ తవ్వకాలు చేపట్టి రూ.కోట్లు ఆర్జించారు. భూములిచ్చిన పేదలను గాలికొదిలేశారు. గూడు కోల్పోయిన 75 ఎస్టీ కుటుంబాలు వైకాపా నేతలకు భయపడి అసౌకర్యాల మధ్య అగ్గిపెట్టెల్లాంటి షెడ్లల్లో గడిపేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నకిలీ సీట్లతో.. ఎవరికి లాభం?

రాష్ట్రంలోని మూడు వైద్య కళాశాలలకు నకిలీ పీజీ సీట్ల కేటాయింపు కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం చరిత్రలోనే ఎన్నడూ ఇంత భారీ మోసం జరగలేదు. జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) స్పష్టంగా.. ఈ మూడు కళాశాలలకు అదనపు సీట్లు కేటాయించలేదని, అవన్నీ నకిలీవని తేల్చేసింది. విద్యార్థులను ముంచేసి.. వారి జీవితాలతో ఆడుకుని, భారీగా లబ్ధి పొందే ఈ మోసంతో తమకు సంబంధం లేదంటే..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. దడ పుట్టిస్తున్న ధరలు

ఇటీవల టమాట ధర చూసి సామాన్యులకు నోట మాట రాలేదు.. ప్రస్తుతం కందిపప్పు, బియ్యం, జీలకర్ర, పాలు వంటి నిత్యావసరాల ధరలు చూసి హడలిపోతున్నారు. ఇలా అయితే అయిదు వేళ్లు నోట్లోకెళ్లేదెలా అంటూ ఆందోళన చెందుతున్నారు. వేసవిలో అకాలవర్షాలు, ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ కారణంగానే ప్రస్తుతంధరలు మండిపోతున్నాయని వర్తకులు అభిప్రాయపడుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రైలులో మహిళ పర్సు చోరీ.. కిటికీకి దొంగ వేలాడదీత

బిహార్‌లోని బెగూసరాయ్‌ జిల్లా పరిధిలో శనివారం కటిహార్‌ నుంచి సమస్తిపుర్‌ వెళ్తున్న రైలులో ఓ మహిళ పర్సు చోరీకి గురైంది. కిటికీ ఊచలు పట్టుకొని వేలాడుతూ దూకేందుకు ప్రయత్నిస్తున్న దొంగను మిగతా ప్రయాణికులు గుర్తించారు. వెంటనే లోపల్నుంచి ఆ యువకుడి చేతులు గట్టిగా పట్టుకున్నారు. కొన్ని కిలోమీటర్లు అలాగే వేలాడుతూ ప్రయాణించాక.. బచ్వారా జంక్షనులో రైలు ఆగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ప్రపంచంలోనే పొడవైన కురులు ఆమె సొంతం

అమెరికాకు చెందిన 58 ఏళ్ల మహిళ తామి మానిస్‌ ప్రపంచంలోనే అతి పొడవైన కురులు కలిగిన మహిళగా గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నారు. నాక్స్‌ విల్లేకు చెందిన ఈమెకు 172.72 సెం.మీ (5.8 అడుగుల) పొడవైన జుట్టు ఉన్నట్లు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు వెల్లడించారు. టెన్నెసే రాష్ట్రంలోని నాక్స్‌విల్లేకు చెందిన మానిస్‌ ప్రభుత్వ నర్సుగా పని చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ముంచేస్తున్నా.. ముందు చూపేది?

రాజమహేంద్రవరంలో రెండ్రోజుల క్రితం కురిసిన వర్షానికి ఓ లాడ్జి ముంపులో చిక్కుకుంటే అందులో వ్యక్తులను మొదటి అంతస్తులో కిటికీ నుంచి బయటకు తెచ్చారు. గత ఏడాది వర్షాల సమయంలో సుమారు నెలపాటు కొన్ని ప్రాంతాల్లో పడవల్లో జనం రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. కాకినాడలోనూ 2021లో ఇదే దుస్థితి పలుచోట్ల చోటు చేసుకుంది. గట్టిగా గంటపాటు వర్షం పడితే రెండు నగరాల్లోనూ పలు ప్రాంతాలు ముంపులో చిక్కుకుని గంటల తరబడి జనం అవస్థలు పడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మీటర్లు లేక.. దోపిడీ పక్కా!

తెలంగాణకు చెందిన ప్రవీణ్‌ కుటుంబం విధుల నిమిత్తం తిరుపతికి వచ్చి స్థానికంగా నివాసం  ఉంటోంది. ఇటీవల భార్యతో కలసి సొంతూరుకు వెళ్లి తిరిగి రైల్లో తిరుపతికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఆటోలో నారాయణపురం వెళ్లేందుకు స్టేషన్‌ బయట ఉన్న ఆటోలను ఆశ్రయిస్తే రూ.250 ఛార్జీగా చెప్పి.. రూ.200 ఇస్తే వస్తామన్నారు. అతన్ని కాదని స్టాండ్లో ఉన్నవారెవరూ రాలేని పరిస్థితి ఉండటంతో చేసేది లేక  అడిగినంత ఇచ్చి ప్రయాణించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని