Bihar: రైలులో మహిళ పర్సు చోరీ.. కిటికీకి దొంగ వేలాడదీత

బిహార్‌లోని బెగూసరాయ్‌ జిల్లా పరిధిలో శనివారం కటిహార్‌ నుంచి సమస్తిపుర్‌ వెళ్తున్న రైలులో ఓ మహిళ పర్సు చోరీకి గురైంది. కిటికీ ఊచలు పట్టుకొని వేలాడుతూ దూకేందుకు ప్రయత్నిస్తున్న దొంగను మిగతా ప్రయాణికులు గుర్తించారు.

Updated : 04 Sep 2023 08:17 IST

బిహార్‌లోని బెగూసరాయ్‌ జిల్లా పరిధిలో శనివారం కటిహార్‌ నుంచి సమస్తిపుర్‌ వెళ్తున్న రైలులో ఓ మహిళ పర్సు చోరీకి గురైంది. కిటికీ ఊచలు పట్టుకొని వేలాడుతూ దూకేందుకు ప్రయత్నిస్తున్న దొంగను మిగతా ప్రయాణికులు గుర్తించారు. వెంటనే లోపల్నుంచి ఆ యువకుడి చేతులు గట్టిగా పట్టుకున్నారు. కొన్ని కిలోమీటర్లు అలాగే వేలాడుతూ ప్రయాణించాక.. బచ్వారా జంక్షనులో రైలు ఆగింది. ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌కు అతణ్ని అప్పగించారు. రైలు కిటికీకి దొంగ వేలాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని