AP Liquor Business: నాడు భారీ మొత్తాలు కట్టారు.. నేడు రెన్యువల్‌ చేసుకోనేలేదు!

రాష్ట్రంలో గతేడాది రూ. కోట్లు పెట్టి బార్లు దక్కించుకున్న మద్యం వ్యాపారులు.. ఈ ఏడాది వాటి రెన్యువల్‌ కోసం లైసెన్సు ఫీజులు చెల్లించలేదు.

Updated : 04 Sep 2023 07:20 IST

లైసెన్సులు పునరుద్ధరించుకోని 16 బార్లు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో గతేడాది రూ. కోట్లు పెట్టి బార్లు దక్కించుకున్న మద్యం వ్యాపారులు.. ఈ ఏడాది వాటి రెన్యువల్‌ కోసం లైసెన్సు ఫీజులు చెల్లించలేదు. ఆ బార్‌ల లైసెన్సులు వదిలేసుకున్నారు. రాష్ట్రంలో సాధారణ బార్లు 840, స్టార్‌ హోటళ్లలో బార్లు 42, మైక్రో బ్రూవరీలు 8 ఉన్నాయి. వీటికి లైసెన్సుల జారీ కోసం గతేడాది ప్రభుత్వం వేలం నిర్వహించగా నిర్ణీత లైసెన్సు రుసుముకు అనేక రెట్లు అధికంగా చెల్లించేలా వేలం పాడి ఆ బార్లు దక్కించుకున్నారు. ఈ ఏడాది వాటి రెన్యువల్‌ కోసం ఆగస్టు 31వ లోగా ఫీజులు చెల్లించాల్సి ఉండగా.. 16 సాధారణ బార్‌ల లైసెన్సీలు, 3 స్టార్‌ హోటళ్లలోని బార్‌ల లైసెన్సీలు ఆ రుసుములు చెల్లించలేదు. ఈ లైసెన్సు రూపంలో ప్రభుత్వానికి రూ. 588 కోట్లు రావాల్సి ఉండగా.. రూ.555 కోట్లు వచ్చాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 6 బార్లు, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల పరిధిలో రెండేసి చొప్పున, కాకినాడ, బాపట్ల, కడప, నంద్యాల్లో ఒక్కోటి చొప్పున బార్‌లకు సంబంధించిన లైసెన్సీలు రెన్యువల్‌ రుసుములు చెల్లించలేదు. గతేడాది బార్‌ల వేలం సమయంలో జనాభా ఆధారంగా రూ.15 లక్షలు, రూ.35 లక్షలు, రూ.50 లక్షలు లైసెన్సు ఫీజులుగా నిర్ణయించి వేలం పాటలు నిర్వహించగా.. కడప తదితర చోట్ల బార్‌లు రూ.కోట్లల్లో పలికాయి. ఆ స్థాయిలో వ్యాపారం సాగకపోవటంతో అలాంటి వారిలో కొందరు ఈ ఏడాది రెన్యూవల్‌ చేసుకోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని