Trains cancelled: 11వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు

విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 04 Sep 2023 08:05 IST

కాకినాడ (సాంబమూర్తినగర్‌), న్యూస్‌టుడే: విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు-విశాఖపట్నం (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం-మచిలీపట్నం (17220) రైలును సెప్టెంబరు 5 నుంచి 10వ తేదీ వరకు, విశాఖపట్నం-గుంటూరు (17240) రైలును 6 నుంచి 11 వరకు, విశాఖపట్నం-విజయవాడ (22701), విజయవాడ-విశాఖపట్నం (22702) ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ను 5, 6, 8, 9 తేదీల్లో రద్దుచేశారు. గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ (17243), మచిలీపట్నం-విశాఖపట్నం (17219), విశాఖపట్నం-లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లను ఈ నెల 9 వరకు, లింగంపల్లి-విశాఖపట్నం (12806) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌, రాయగడ-గుంటూరు (17244), విజయవాడ-విశాఖపట్నం (12718), విశాఖపట్నం-విజయవాడ (12717) రత్నాచల్‌లను 10 వరకు రద్దుచేసినట్లు తెలిపారు. తిరుపతి-విశాఖపట్నం (22708) డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ 6, 8 తేదీల్లో సామర్లకోట వరకే నడుస్తుందని, విశాఖలో బయల్దేరాల్సిన విశాఖపట్నం-తిరుపతి (22707) రైలు 7, 9 తేదీల్లో సామర్లకోట స్టేషన్‌ నుంచి బయలుదేరుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని