Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Mar 2024 09:09 IST

1. గృహరుణ భారం తగ్గేదెలా?

గృహరుణం చాలామందికి భారంగా మారింది. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు గృహరుణం తప్ప మరో ఆదాయ ప్రత్యామ్నాయం లేకపోవడంతో అధిక వడ్డీరేట్లకైనా తీసుకొనేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ఆ భారాన్ని దీర్ఘకాలంగా మోస్తున్నారు. చాలామంది పదవీ విరమణ చేసిన తర్వాత కూడా గృహరుణానికి వాయిదాలు చెల్లించాల్సిన పరిస్థితిలో ఉన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. మాడినా..మూడినా..మొక్కాల్సిందే!

పామర్రులో విద్యాదీవెన నిధుల విడుదల సభ కోసం.. భారీగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులను తరలించడంతో ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌ ఉదయం 11 గంటల సమయంలో హెలీకాప్ట్టర్‌ దిగి సభా ప్రాంగణానికి వచ్చే సమయంలో.. ఎండ మండిపోతుంటే.. రహదారికి ఇరువైపులా వందల మంది మహిళలను నిలబెట్టి.. అవస్థలకు గురిచేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఏఐయారే..ఈ భామ అందం!

పక్కనున్న ఈ భామని చూస్తే.. ‘ఎంతందంగా ఉన్నావే.. ఎవరే నువ్వూ..’ అని పాడాలనిపిస్తుంది కదూ! ఔను.. తను అందగత్తెనే. ప్రపంచంలోనే హాటెస్ట్‌ మోడల్‌. పేరు ఎమిలీ పెల్లెగ్రినీ. వయసు 23. ఇటలీ మోడల్‌. అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌లో మకాం. కేవలం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ద్వారానే లక్షలు సంపాదిస్తోంది. అందుకే మన పేజీలోకి వచ్చింది. ఇంకా తన విశేషాలు చాలానే ఉన్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. చేయి తడిపితే సరే!!

మహా విశాఖ నగరపాలక సంస్థకు ఆదాయాన్ని సమకూర్చే మార్కెట్లనూ వైకాపా నాయకులు వదలడం లేదు. పాలకవర్గం కొలువుదీరి మూడేళ్లవుతోంది. ఏటా జీవీఎంసీ ఆదాయాన్ని పెంచేలా ప్రణాళికలు రచించాల్సిన కొందరు సభ్యులు అందుకు విరుద్ధంగా గుత్తేదారులతో కుమ్మక్కై రాబడికి గండికొడుతున్నారు. తమ దారికి రాని గుత్తేదారుల లీజులను రద్దు చేసేలా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. నోటికి వెలకడుతూ.. నోటుతో జో కొడుతూ..!

‘ముఖ్య నేతలతో పాటు వైకాపా ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని వదిలి వెళ్లిపోకుండా ఉంచడం ఎలాగో తెలియక.. కొత్త ఇన్‌ఛార్జులు తలలు పట్టుకుంటున్నారు. చివరకు ఆర్థిక ప్రయోజనాలు ఎరవేస్తూ.. పార్టీలోనే ఉండాలని బతిమాలేే పరిస్థితి వచ్చింది. విజయవాడ శివార్లలోని ఓ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి మొత్తం ఖాళీ అవుతుండగా పార్టీలోనే ఉండాలని సర్పంచులను సామాజిక వర్గాల వారీగా విభజించి మరీ తాయిలాలు పంచుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. నేను మేడారం.. నన్ను బాగు చేయండి

అందరికీ శుభోదయం. నేనండి మీ మేడారాన్ని. తల్లులకు నెలవై... అన్ని వర్గాలకు కొలువై...కోటిన్నర మందిని అక్కున చేర్చుకున్నా. నా చెంత విధులు నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి, అమ్మల దర్శనానికి వచ్చిన ప్రముఖులతో పాటు భక్త జనానికి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పడ్డా. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, హెలికాప్టర్లు, కాలినడకన... ఇలా ఎవరెలా చేరుకున్నా అందరినీ మళ్లీ సురక్షితంగా ఇళ్లకు పంపా. మహాజాతర అంగరంగ వైభవంగా జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. వేటు వేస్తున్నా... రూటు మారలె!

తప్పతాగి వాహనాలు నడుపుతున్న వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్సులు సస్పెన్షన్‌ చేస్తున్నా సరే...వారి రూటు మారడం లేదు. గత ఏడాది గ్రేటర్‌ వ్యాప్తంగా 10,258 డ్రైవింగ్‌ లైసెన్సులపై రవాణాశాఖ వేటు వేసింది. ఇందులో కేవలం 6395 లైసెన్సులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులకు సంబంధించినవే ఉన్నాయి. కనీసం మూడు నెలల నుంచి గరిష్ఠంగా 6 నెలల వరకు ఈ లైసెన్సులను సస్పెన్షన్‌లో ఉంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. బకాయిల భారం.. వీధుల్లో అంధకారం

నగర పాలక సంస్థ, పురపాలికల్లో వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా మారింది. మీర్‌పేట్‌, బడంగ్‌పేట్‌, బండ్లగూడజాగీర్‌, హయత్‌నగర్‌, తుర్కయాంజాల్‌ పురపాలిక, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్‌ సమీపంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించుకోవడంతో పాటు, నిర్వహణ భారాన్ని నియంత్రించుకునేందుకు ఓ ప్రైవేటు సంస్థకు బాధ్యత అప్పగించారు. కొద్దిరోజులు బాగానే ఉన్నా తరువాత పరిస్థితి అదుపు తప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. పింఛను సొమ్ముతోనూ వైకాపా ఓట్ల వేట

ప్రభుత్వ పథకాల లబ్ధిని వాలంటీర్ల సహకారంతో అందజేస్తూ వైకాపా నాయకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కాకినాడలో ఏకంగా సీఎం జగన్‌, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చిత్రాలతో పింఛను పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం ‘వైఎస్సార్‌ పింఛను కానుక’ సొమ్మును కవర్లలో పెట్టి వాలంటీర్లతో కలిసి డివిజన్లలో వైకాపా ముఖ్య నాయకులు పంచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ప్రైవేటులో అమ్మకు కడుపు కోతలు

ఓ వైపు గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేసి తల్లి, బిడ్డ క్షేమంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు ఆ ఆదేశాలు బేఖాతర్‌ చేస్తూ.. పలు ప్రైవేటు ఆసుపత్రులు శస్త్రచికిత్సలు (కడుపు కోతలు) అధికంగా చేస్తున్నాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న జిల్లా అధికారులు ఇటీవల ఏడు ఆసుపత్రులకు తాఖీదులు జారీ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని